Horoscope Today July 9th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..

Horoscope Today July 9th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మిథున, కన్య, వృశ్చిక తదితర రాశుల వారికి కలిసొస్తుంది. కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, మరికొన్నిరాశుల వారికి నెగటివిటీ తప్పకపోవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 06:43 AM IST
  • మిథున, కన్య, వృశ్చిక రాశుల వారికి కలిసొస్తుంది
  • ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే
Horoscope Today July 9th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..

Horoscope Today July 9th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ చాలా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి మాత్రమే అన్నింటా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి కలిసొస్తుంది.. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఎదురువతాయనేది ఇవాళ్టి రాశి ఫలాల్లో తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

పనిభారం కారణంగా అలసిపోతారు. అది మిమ్మల్ని సోమరిగా, పట్టింపులేని వ్యక్తిగా మార్చవచ్చు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపికతో వ్యవహరించాలి. ఎక్కడికైనా టూర్‌కి వెళ్లాలనే ఆలోచనలో ఉంటే ప్రస్తుతానికి మానుకోండి. కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకోండి. ఆర్థికపరంగా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. విద్యార్థులు చదువుపై ఫోకస్ పెంచాలి.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీలోని సృజనాత్మకత పీక్స్‌లో ఉంటుంది. కొన్ని వివాదాలకు సంబంధించి శుభవార్త వింటారు. స్నేహితులు, సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఇంటి మరమత్తులు చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు కలిసొస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీరు చేపట్టిన పనుల్లో తోబుట్టువులు, సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. తద్వారా ఆర్థికంగా అంతా బాగుంటుంది. మీ పనుల్లో మీ నెట్‌వర్క్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తోడ్పడుతుంది. పెద్దలతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేసుకుంటారు.

కర్కాటక రాశి (Cancer) 

నిద్రలేమి కారణంగా ఇవాళంతా నిరుత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యం నుంచి దృష్టి మరలుతుంది. అది మీ పని సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉండదు. అయితే సాయంత్రానికల్లా అన్నీ సర్దుకుంటాయి. నెగటివిటీ వీడుతుంది.తప్పులను సరిదిద్దుకుని కొత్త ప్లాన్స్‌తో సిద్ధమవుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం.

సింహ రాశి (LEO)

ఇవాళ మధ్యాహ్నం వరకు నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అప్పటివరకూ మీ పనుల్లో కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. పెద్దల ఆశీస్సులతో సమస్యల నుంచి బయటపడుతారు. ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రత్యర్థులు లేదా శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కీలక నిర్ణయాల్లో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

కన్య రాశి (Virgo)

పని ప్రదేశంలో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ముగిసే సరికి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. అది సమీప భవిష్యత్తులో మీ జీవితానికి చాలా మేలు చేస్తుంది. ఉద్యోగంలో మీ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. తోబుట్టువులు.. వారు కొనసాగుతున్న రంగంలో కొత్త విజయాలు అందుకుంటారు. న్యాయపరమైన వివాదాల్లో గెలుపు మీవైపే ఉంటుంది. లక్ష్యాలను అందుకునే విషయంలో విద్యార్థులు మరింత ఫోకస్‌గా ఉండాలి.

తులా రాశి (Libra)

వృత్తిపరంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా చాలా పనులు చక్కబెడుతారు. మీ చుట్టూ ఉన్న అందరితో మర్యాదపూర్వకంగా మెలుగుతారు. మీ మంచితనం కారణంగా అందరిలోనూ మీ పట్ల గౌరవం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని భావాలను ఒకరికొకరు పంచుకోవాలి. అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio)

వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చుకోవడం కలిసొస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇవాళంతా చాలా ఎనర్జిటిక్‌గా పనిచేస్తారు. మీ పనితనం, ఉత్సాహం మీకు మంచే చేస్తుంది. మీకున్న ఆత్మగౌరవం మీ చుట్టూ నెగటివ్ వ్యక్తులను దరిచేరకుండా చేస్తుంది. కుటుంబ జీవితం, ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. లేదా సోషల్ గెట్ టు గెదర్‌లో బిజీగా గడుపుతారు. వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. వ్యాపారపరంగా ఊహించని లాభాలు రావొచ్చు. పిల్లలు చదువుల్లో విశేషంగా రాణిస్తారు. ప్రేమికులు తమ ప్రియురాలు లేదా ప్రియుడితో ఎక్కువ సమయం గడుపుతారు.

మకర రాశి (Capricorn) 

చిన్న చిన్న పెట్టుబడులే పెద్ద లాభాలే తీసుకొస్తాయి. ఆర్థిక స్థితి చాలావరకు మెరుగవుతుంది. తక్కువ కష్టపడుతారు.. ఎక్కువ లాభం పొందుతారు. న్యాయపరమైన చిక్కులు వీడుతాయి. మీ ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ జోలికి రారు. మీ పనితనం, సామర్థ్యం మరింత పెరుగుతుంది.

కుంభ రాశి (Aquarius)

చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. వృత్తిరీత్యా అంతా అనుకూలిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. బిజినెస్‌పరంగా కొత్త ఆవిష్కరణలు చేపడుతారు. జీవితభాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి.

మీన రాశి (Pisces) 

ఇవాళంతా సానుకూలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఉండవు. వృత్తిరీత్యా మీకున్న నెట్‌వర్క్ కలిసొస్తుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ జీవితం వికసిస్తుంది. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబం లేదా స్నేహితులతో కలిసి సినిమాలకు లేదా ఔటింగ్‌కి వెళ్తారు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Hyderabad Rains Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎక్కడెక్కడ ఎంత వర్షం కురిసిందంటే

Also Read: Amarnath Cloudburst Updates: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి.. 13 మందికి పెరిగిన మృతుల సంఖ్య..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News