Horoscope 2022 February 28: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి!

Today Horoscope: ఈ రోజు కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారు. మరికొన్ని రాశులవారికి మిశ్రమ కాలం నడుస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 07:13 AM IST
Horoscope 2022 February 28: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి!

Horoscope 2022 February  28:  సాధారణంగా మనం ఏ పని మెుదలపెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్న ఆ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయోనని చూస్తాం. మరి నేటి (సోమవారం) రాశిఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయో  పరిశీలిద్దాం.

మేషం ( Aries): ఈ రోజు ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మెుదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తారు. 

వృషభం  (Taurus): ఈరాశివారు కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. బాగా శ్రమిస్తే..అనుకున్నది సాధిస్తారు. కొత్తగా ఏది చేయాలన్నా కుటుంబసభ్యుల అంగీకారం తీసుకోండి. 

మిథునం (Gemini):  మొదలు పెట్టిన పనులను పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  కార్యసిద్ధి ఉంది. 

కర్కాటకం (Cancer) : ఈ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో ఓర్పు ఉండాలి. వీరికి ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. 

సింహం (Leo): వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా లాభిస్తోంది. కొత్త వస్తువులను కొంటారు. నూతన పనులను ప్రారంభిస్తారు. 

కన్య (Virgo): మొదలు పెట్టిన పనిలో మంచి ఫలితాలను అందుకుంటారు. సమయానికి సహాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  

తుల (Libra):  కుటుంబసభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది.

వృశ్చికం (Scorpio): ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలున్నాయి.  అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు చేయకండి. 

ధనస్సు (Sagittarius) : ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మకరం (Capricorn) : వీరికి శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొందరి ప్రవర్తనా మిమ్మల్ని బాధపట్టే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. 

కుంభం (Aquarius): ఈ రాశివారు పెద్దల నుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. శ్రమకు తగిన  ఫలితం ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు.

మీనం (Pisces) :  ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.  ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి.  ప్రయాణాలు అనుకూలిస్తాయి.  యశస్సు వృద్ధి చెందుతుంది.

Also Read: Astrology: మకర రాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారి జాతకం మారబోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News