Horoscope 2022 February 27: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఒక శుభవార్త వింటారు!

Horoscope 2022 February 27: నేడు 2022 ఫిబ్రవరి 27 (ఆదివారం). ఈ రోజు కొన్ని రాశులవారికి అనుకూలం. మరికొన్ని రాశులవారికి మిశ్రమ కాలం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 09:50 AM IST
Horoscope 2022 February 27: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు ఒక శుభవార్త వింటారు!

Horoscope 2022 February  27:  మనం ఏ పని మెుదలపెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్న ఆ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయోనని చూస్తాం. మరి నేటి (ఆదివారం) రాశిఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయో  ఓ లుక్కేద్దాం.

మేషం ( Aries): ఈ రోజు ఈరాశివారు శత్రువుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లండి. మంచి పోషాకాహారాన్ని తీసుకోండి.

వృషభం  (Taurus):  ఈ రాశివారు కొన్ని  విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. 

మిథునం (Gemini):  ఈ రోజు ఈరాశివారికి శుభఫలాలు అందుతాయి. ఒక విషయంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి వస్తోంది. 

కర్కాటకం (Cancer) : ఈ రాశివారు పొదుపు పాటించాలి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఓర్పుగా ఉండండి. 

సింహం (Leo): వీరి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. సౌభాగ్య సిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. 

కన్య (Virgo):  ఈ రాశివారు ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. 

తుల (Libra): ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చికం (Scorpio): ఈ రాశివారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. సంకల్పసిద్ధి ఉండాలి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి.

ధనస్సు (Sagittarius) :  ఈ రోజు ఈ రాశివారికి తోటివారి సహకారం అందుతుంది. ఒక శుభ వార్త వింటారు. ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలం.

మకరం (Capricorn) : మిశ్రమ కాలం నడుస్తోంది. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండటం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. 

కుంభం (Aquarius): కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. 

మీనం (Pisces) : ఏ పని మెుదలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యంగా వ్యవహారించవద్దు. 

Also Read: Vijaya Ekadashi 2022 Date: విజయ ఏకాదశి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. కోరికలన్నీ నెరవేరుతాయట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News