Guru Ki Mahadasha Ke Upay: అందరి జాతకాల్లో గ్రహాల మహాదశ, అంతర్దశ నడుస్తాయి. జాతకంలో గ్రహాలు శుభ లేదా బలమైన స్థానంలో ఉంటే..మహాదశ సమయంలో ఆ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన చాలా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బృహస్పతి గ్రహం కూడా వ్యక్తుల గ్రహాల్లో మహాదశలో ఉంటే చాలా రకాల మార్పలు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఏ రాశివారికైనా మహాదశ 16 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ క్రమంలో రాశి చక్రమంలో దశ అనుకూలంగా ఉండే విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. లేకపోతే తీవ్ర నష్టాలను పొందే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ప్రభావం:
ఒక రాశివారి జీవితంలో మహాదశ కొనసాగితే వ్యక్తుల జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించవచ్చు. అంతేకాకుండా వీరు ఆర్థిక ప్రయోజనాలేకాకుండా జీవితంలో 16 సంవత్సరాల పాటు ఊహించని లాభాలు పొందుతారు. ఈ క్రమంలో వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. విద్యారంగంలో ఉన్నవారు కూడా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిది.
శుభ స్థితి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే..వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాకుండా వీరు ప్రశాంతంగా, చాలా జ్ఞానాన్ని పొందే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో విద్య, బుద్ధులు కూడా పొందుతారు. వీరు ఎలాంటి పనులు చేసిన లాభాలు పొందుతారు.
చెడు పరిస్థితి:
జాతకంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే జీవితంలో చాలా కష్టాలను ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతారు. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇలా చేయాల్సి ఉంటుంది:
జాతకంలో గురువు, బృహస్పతి బలహీనమైన లేదా అశుభ స్థితిలో ఉంటే..తప్పకుండా దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి గురువారం ఉపవాసం ఉండాలి. అంతేకాకుండా పసుపు మిఠాయిలు లేదా శనగపిండితో తయారు చేసి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. గురువారం అరటి చెట్టుకు పూజ చేసి పసుపు, బెల్లం, శనగపప్పు సమర్పించాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook