Grah Gochar 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల మొదటి సంచారం.. ఇక 5 రాశువారి నష్టాలు తప్పవా..?

Grah Gochar 2023: వచ్చే కొత్త సంవత్సరంలో చాలా రాశులో సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారం కారణంగా పలు రాశువారి జీవితంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 09:46 AM IST
Grah Gochar 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల మొదటి సంచారం.. ఇక 5 రాశువారి నష్టాలు తప్పవా..?

Grah Gochar 2023: ఇంకొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అయితే పోయిన సంవత్సరంలో తిరోగమనం చెందిన శని గ్రహం కొత్త సంవత్సరంలో కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా ఇదే క్రమంలో శుక్రుడు, సూర్య గ్రహాలు కూడా ఇతర రాశుల్లోకి  సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారాలు జనవరి 14న జరిగే అవకాశాలున్నాయి. ఇక సూర్య గ్రహ సంచారం విషయానికొస్తే మకర రాశిలోకి, శుక్రుడు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల జనవరి 12 కుజుడు, బుధుడు పలు రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపబోతున్నాడు. అయితే ఈ క్రమంలో 12 రాశువారి జీవితాల్లో పలు మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై ప్రత్యేక్ష ప్రభావం:
మేష:

ఆ మూడు రాశుల సంచారం వల్ల మేష రాశివారి జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో మేషరాశి వారు తీవ్ర ఇబ్బందుల పాలయ్యే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆదాయం తగ్గి ఖర్చులు కూడా పెరుగుతాయి. కార్యాలయాల్లో పలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ప్రతి మంగళవారం సుందరకాండ పఠించాల్సి ఉంటుంది.

కర్కాటకం:
కొత్త సంవత్సరం మొదటి మాసంలోనే గ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితో అనుబంధం మధురంగా ​ఉండబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కర్కాట రాశి వారికి టెన్షన్ పెరుగుతుంది. అయితే ఈ రాశి వారు వచ్చే సంవత్సరంలో చాలా రకాల కష్టాలను ఎదుర్కొనే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయండి.

కన్య:
కన్య రాశి వారికి ఈ సంచారం వల్ల ఆదాయం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆదాయం తగ్గి ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య సమ్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో మాత్రం రాశి ఉన్నత శిఖరాలకు చేరుతారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి  ఆవుకు పాలకూర తినిపించండి.
 
వృశ్చికం:
ఆ మూడు రాశు సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కూడా చాలా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో వీరు ఉద్యోగాలు మారే ఛాన్స్‌ కూడా ఉంది. ప్రేమ జీవితంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పలు తగాదలు అయిన మళ్లీ భవిష్యత్‌లో కలుసుకునే అవకాశాలున్నాయి.  ఈ క్రమంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించండి.

కుంభ:
జనవరిలో శనిగ్రహం కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసే వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమేకాకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంచారం వల్ల కోపం పెరుగుతుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా

Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News