Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని

Andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ఈసారి టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి బ్రహ్మరథంపట్టారు. తమకు మంచిపాలన అందిస్తారనే ఉద్దేష్యంతో కూటమికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇదిలా ఉండగా.. గతఐదేళ్లలో ఏపీ అనేక రంగాలలో వెనక్కు వెళ్లిపోయిందని కూటని నేతలు విమర్శిస్తున్నారు. 

1 /7

మరోవైపు కూటమి ఏర్పడటంలో జనసేన అధినేతు పవన్ కళ్యాణ్ తనదైన మార్కుచూపించారు. ఎక్కడకూడా ఓట్లు చీలకుండా కూటమిగా ఏర్పడి, ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీకి దిమ్మతిరిగే విధంగా షాక్ ఇచ్చి విజయం సాధించారు.

2 /7

ఇటీవల చంద్రబాబు నాయుడు, 24 మంది ప్రమాణస్వీకారం కార్యక్రమంవేడుకగా జరిగింది. దీనికి రాజకీయ,సినిమా రంగానికి చెందిన వీఐపీలు హజరయ్యారు. ప్రజలు కూడా భారీ ఎత్తున హజరయ్యారు. ఇక చంద్రబాబు.. కూడా మంత్రులకు ఆయా శాఖలను కేటాయించారు. 

3 /7

పవక్ స్టార్ పవర్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నికల బరిలో నిలబడ్డారు. పలుమార్లు ఓటమి చెందిన కూడా ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. గతంలో పోటీచేసిన రెండు స్థానాల్లో ఓడినా కూడా.. వైసీపీ వాళ్లు ఎన్ని అవమానాలకు గురిచేసిన కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కూటమిగాబరిలో దిగారు.

4 /7

పోటీ చేసిన 21 కి 21 స్థానాలు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డ్ లు క్రియేట్ చేశారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక చంద్రబాబు.. ఇటీవల పవన్ కళ్యాణ్ కు తన కేబినేట్ లో డిప్యూటీ సీఎంతో పాటు, మరో నాలుగు శాఖలను కూడా కేటాయించారు. 

5 /7

ఇదిలా ఉండగా.. ఈ నెల 19వ తేదీ ద్వాదశి తిథిన జనసేనాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని ఏవిధంగా పాలనలో తన మార్కు చూపిస్తారో  ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

6 /7

ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాత్రం కీలక శాఖలు దక్కాయని చెప్పుకొవచ్చు. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. ఆయనకు నాలుగు శాఖలు అప్పగించారు. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు.

7 /7

జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు. అదే విధంగా.. మంత్రి కందుల దుర్గేష్‌ కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోను చంద్రబాబు, తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండేలా  చేసి సముచిత గౌరవం కల్పించారు.