Ghmc Amrapali serious on ys jagan illegal construction demolish issue: జీహెచ్ ఎంసీ ఇన్ చార్జీ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఇటీవల లోటన్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం ఇంటి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను బల్దియా సిబ్బంది బుల్డొజర్లతో కూలగొట్టారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా.. కూడా అధికారులు ఈ పనులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు తెలుగు రాష్ట్రాలో కూడా రాజకీయంగా రచ్చగా మారింది. చంద్రబాబు శిష్యుడు.. జగన్ కు చుక్కలు చూపించాడంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ లకు పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
దీనిపై జీహెచ్ఎంసీ ఇన్ చార్జీ కమిషనర్ ఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. లోటన్ పాండ్ వద్ద ఉన్న నిర్మాణాలను కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిన ఖైరతాబాద్ కమిషనర్.. ఐఏఎస్ హేమంత్ భోర్కడే ను బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన వెంటనే.. జీఐడీకీ రిపోర్టు చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు.
నిన్నబల్దియా అధికారులు లోటస్ పాండ్ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను పడగొట్టారు. వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు సెక్యురిటీ కోసం ఏపీ సిబ్బంది ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక మంత్రి సూచనలతో ఈ కూల్చివేతపనులు చేసినట్లు సమాచారం. కానీ.. ఘటనపై ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా.. అధికారి అత్యుత్సాహంతో ప్రవర్తించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కమిషనర్ హేమంత్ భోర్కడేను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. రోడ్డు ఆక్రమ ఘటనపై ఎవరైన ఫిర్యాదులు చేశారా..?.. అన్న దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటన కాస్త తెలంగాణ సీఎం రేవంత్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పును పొందడానికి కూడా చేయించాడంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఏది ఏమైన ఇలాంటి చర్యలు చేపట్టేటప్పుడు నోటీసులు ఇవ్వడం, ఉన్నతాధికారులకు సరైన ఇన్ ఫర్మెషన్ ఇవ్వడం వంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ అవేం పాటించకుండా.. సదరు అధికారి హేమంత్ భోర్కడే ఈవిధంగా లోటస్ పాండ్ నిర్మాణాలు కూల్చేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల బల్దియా సీరియస్ గా స్పందించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Amrapali: వైఎస్ జగన్ ఇంటి ముందు బుల్డోజర్లు దింపడంపై ఐఏఎస్ ఆమ్రపాలి సీరియస్..
లోటస్ పాండ్ కూల్చివేతపై అమ్రాపాలీ సీరియస్..
ఆ అధికారిపై వేటు వేసిన బల్దియా సిబ్బంది..