Planet Transit 2023: ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మారుస్తుంది. గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. వచ్చే జూలై నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు గమనంలో మార్పు రానుంది. జూలై 1న కుజుడు, జూలై 7న శుక్రుడు, జూలై 8న బుధుడు వేరే రాశుల్లోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
గ్రహాల సంచారం ఈ రాశులకు శుభప్రదం
తులారాశి
జూలైలో గ్రహాల సంచారం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుని సంచారం ఈ రాశివారికి అదృష్టాన్ని ఇస్తుంది. దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం బాగుంటుంది.
మేషం
మేష రాశి వారికి అంగారకుడి సంచారం మేలు చేయనుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
మిధునరాశి
శుక్రుడు, బుధుడు రాశి మార్పు మిథునరాశివారికి కలిసి వస్తుంది. మీరు మీ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కోరుకున్న జాబ్ వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Budhaditya Rajyog: రేపటి నుండి ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?
సింహం
సింహరాశికి శుక్రుని సంచారం మేలు చేస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు ధనలాభం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Surya Grahan 2023: త్వరలోనే రెండో సూర్యగ్రహణం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook