Navratri Tips: నవరాత్రుల్లో అఖండ జ్యోతిని ఎలా వెలిగించాలి, ఏ జాగ్రత్తలు అవసరం

Navratri Tips: శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో దీపం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. లేకపోతే సర్వం నాశనమౌతుందట. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 27, 2022, 11:38 PM IST
Navratri Tips: నవరాత్రుల్లో అఖండ జ్యోతిని ఎలా వెలిగించాలి, ఏ జాగ్రత్తలు అవసరం

Navratri Tips: శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో దీపం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. లేకపోతే సర్వం నాశనమౌతుందట. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం..

శరన్నవ రాత్రుల్లో 9 రోజుల వరకూ వ్రతాలు ఉపవాసాలు ఆచరిస్తారు. దుర్గాదేవి కటాక్షం కోసం అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఈ పరిస్థితిలో దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా దిశ విషయంలో నిర్లక్ష్యం తగదంటున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం అశ్వినిమాసంలోని శుక్లపక్షం ప్రతిపద తిధి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమౌతాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన నవరాత్రులు అక్టోబర్ 5 వరకూ ఉంటాయి. ఈ సందర్భంగా 9 రోజులపాటు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. నవరాత్రిలో దుర్గాదేవి సమక్షంలో జ్యోతి వెలిగిస్తారు. ఇది 9 రోజులపాటు వెలుగుతూ ఉంటుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు దిశ సరైందిగా ఉండాలి. లేకపోతే మొత్తం నాశనమౌతుంది. 

నవరాత్రిలో కలశ స్థాపనతో పాటు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. ఈ జ్యోతి 9 రోజులపాటు వెలుగుతూ ఉంటుంది. వాస్తు ప్రకారం అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు దిశ అనేది చాలా ముఖ్యం. తప్పుడు దిశలో వెలిగిస్తే అదృష్టమంతా దురదృష్టంగా మారిపోతుంది. 

వాస్తుశాస్త్రం ప్రకారం అఖండ జ్యోతి స్థాపన ఆగ్నేయ దిశ అంటే సౌత్ ఈస్ట్ చాలా మంచిదిగా భావిస్తారు. ఈ దిశలో అఖండ జ్యోతి వెలిగించడం వల్ల జాతక శుభాలు కలుగుతాయి. దుర్గాదేవి ప్రసన్నమౌతుంది. దాంతోపాటు శత్రువుల నాశనం ఉంటుంది. 

అఖండ జ్యోతి వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. వాతావరణమంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఇంట్లోని నెగెటివ్ శక్తులు నాశనమౌతాయి. పూజా సామగ్రి కూడా ఆగ్నేయ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఒకవేళ ఇంట్లో అఖండ జ్యోతి వెలిగిస్తే..జ్యోతిని ఏకాంతంగా వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లకూడదు. అంటే ఇంట్లో ఎవరో ఒకరు నిత్యం ఉండాలి.

Also read: October Festival list 2022: అక్టోబరు నెలలో రానున్న వ్రతాలు, పండుగలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News