Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత శని-శుక్ర గ్రహాల కలయిక..ఏయే రాశులవారు లాభాలు పొందుతారంటే..

Saturn Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వర గ్రహాల కలయిక శుభ పరిణామంగా చెప్పుకుంటారు ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి అంతేకాకుండా ఆకస్మికంగా శుభవార్తలు కూడా వింటారు. అయితే 2024 సంవత్సరంలో జరిగే ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశి వారి జీవితాలను మార్చబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 09:34 AM IST
Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత శని-శుక్ర గ్రహాల కలయిక..ఏయే రాశులవారు లాభాలు పొందుతారంటే..

Saturn Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని శుక్ర గ్రహాలను మిత్రగ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాలు సంచారం చేయడం శుభ పరిణామంగా భావిస్తారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వచ్చే సంవత్సరం 2024లో శని శుక్ర గ్రహాల కలయిక జరగబోతోంది. శని గ్రహం 2024 సంవత్సరంలో కుంభరాశిలో తిరోగమన దశలో ఉండబోతోంది అయితే అదే రాశిలో శుక్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కుంభ రాశిలో శని శుక్రుడి కలయిక ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడి కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా 2024 సంవత్సరం ఫలప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇక వ్యాపారాలు చేస్తున్న వారైతే మంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతతో చదవడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఇక కెరీర్ విషయానికొస్తే..ఈ సమయంలో వృషభ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి:
కుంభరాశిలో ఏర్పడిన శని శుక్ర గ్రహాల కలయిక మేష రాశి వారిపై కూడా ప్రభావం పడి ఊహించని లాభాలను కలుగబోతున్నాయి. ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఇది ప్రత్యేక సమయంగా భావించవచ్చు. ఎప్పటినుంచో వృత్తిపరంగా వస్తున్న సమస్యలన్నీ ఈ గ్రహాల కలయిక కారణంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

మకర రాశి:
మకర రాశి వారికి కూడా శని శుక్ర గ్రహాల కలయిక చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతోపాటు కెరియర్ సంబంధిత పనుల్లో లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికపరంగా లాభాలు పెరగడం కారణంగా పెట్టుబడులు కూడా పెట్టొచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News