Diwali 2023: దీపావళి రోజు సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పనులు చేయకూడదు..ఎందుకో తెలుసా?

Diwali 2023: దీపావళి పూజలో భాగంగా చాలామంది చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. కాబట్టి దీపావళి పూజలు భాగంగా శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2023, 09:12 PM IST
Diwali 2023: దీపావళి రోజు సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పనులు చేయకూడదు..ఎందుకో తెలుసా?

Diwali 2023: భారతదేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండగను ఆరు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి పండగ ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆరు రోజులపాటు భారతదేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరగనుంది. ఈ పండగ రోజు లక్ష్మీదేవితో పాటు విఘ్నాలను తొలగించే విగ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులంతా ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసి దీపోత్సవంలో పాల్గొంటారు. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని భక్తుల నమ్మకం.

ఇలాంటి ముఖ్యమైన దీపావళి రోజున పూజలో భాగంగా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది లక్ష్మీ అమ్మవారి పూజలు భాగంగా తెలిసి తెలియని తప్పులు చేస్తున్నారు. వీటి వలన పూజ వల్ల వచ్చే ఫలితాలు పొందలేకపోతున్నారు. దీపావళి నోములు ఉన్నవారు, ఉపవాసాలు ఆచరించేవారు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించే వారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం పూజా ప్రారంభ సమయంలో పూజ గదిని మరోసారి శుభ్రం చేయాలి. అయితే శుభ్రం చేసిన తర్వాత ఏర్పడిన చెత్తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు బయటపడేయకూడదు. ఇంట్లోనే ఓ పక్కన పెట్టి ఆ మరుసటి రోజున పడేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ చెత్తలో సాక్షాత్తు అమ్మవారు ఉంటుందని నమ్ముతూ ఉంటారు. దీపావళి రోజున ఉడ్చిపాడేయడం వల్ల ఆనందం ఐశ్వర్యం, దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

దీపావళి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించడం జూదం ఆడడం వంటి పనులు చేయడం మానుకోవాలి. ముఖ్యంగా పూజా సమయాల్లో జూదం అస్సలు ఆడకూడదని శాస్త్రంలో పేర్కొన్నారు. ఇలా డబ్బుతో ఆడటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

దీపావళి పండగ రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల పట్ల దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. శ్రీ మహాలక్ష్మిని పూజించేవారు దీపావళి సాయంత్రం పూట తప్పకుండా ఓపికతో ఉండి పూజా కార్యక్రమం ముగిసేదాకా ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News