Budhaditya Yoga 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు ఒకే రాశులు కలవడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేక యోగాలు జాతకంలో శుభస్థానంలో ఏర్పడితే అనేకరకాల లాభాలు కలుగుతాయి. అదే జాతకంలో అశుభ స్థానంలో ఈ ప్రత్యేక యోగం ఏర్పడితే కష్టాలు ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి గ్రహాలకు రాకుమారుడు బుధుడు సంచార దిశగా కదులుతూ వస్తున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు కూడా సంచారం చేయబోతున్నాడు.
అయితే ఈ రెండు గ్రహాలు తులా రాశిలోనే కలవబోతున్నాయి. దీనికి కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారిపై పడి వ్యక్తిగత జీవితాల్లో పురోగతి, విజయాలు, శ్రేయస్సు లభించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏర్పడే బుధాదిత్య యోగంతో ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి వారికి బుధాదిత్య యోగం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు కష్టపడి పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే ఈ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది సరైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ సమయంలో మిధున రాశి వారికి కూడా ఎంతో శ్రేయస్కారంగా ఉంటుంది. సూర్య, బుధ గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే రాజయోగ ప్రత్యేక ప్రభావం ఈ రాశి వారిపై పడబోతోంది. దీని కారణంగా వీరు ఈ సమయంలో భౌతిక ఆనందం పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో జీవితంలో సానుకూల మార్పులు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మిధున రాశి వారు ఈ రాజయోగం కారణంగా కొత్త వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. ఇక ఎప్పటినుంచో రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రాజయోగం కారణంగా ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.