Astro Remedies For Money: ప్రతి వ్యక్తికి సమాజంలో గుర్తింపు పొందుతూ..ధనవంతుడిగా జీవించాలని ఉంటుంది. అయితే ఎంత కష్టపడినా అందరూ ఆ స్థాయికి చేరలేరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నష్టం, దుబారా, పని చెడిపోవడం, అదృష్టం లేకపోవడం తదితర కారణాలున్నాయి. అయితే జ్యోతిష్యశాస్తంలో ఈ సమస్యల నుండి బయటపడటానికి సింపుల్ రెమిడీస్ (Astro Remedies For Money) ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని ప్రభావవంతమైన నివారణలు గురించి తెలుసుకుందాం. ఇది వ్యక్తికి చాలా డబ్బు, గౌరవం, ఆనందం పొందడంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది.
ప్రతిరోజూ ఈ పనులు చేయండి
**వృత్తిలో విజయం, గౌరవం, పురోగతిని ఇచ్చే గ్రహం సూర్యుడు. జాతకంలో సూర్యుడు బలపడాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వీలైతే రోలీ, అక్షతలను నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుంది. త్వరలో మీ కెరీర్ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది.
**హిందూ మతంలో, తులసిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. కాబట్టి ఇంట్లో తులసి మొక్కను నాటండి మరియు ప్రతిరోజూ పూజించండి. రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి తులసికి నీళ్ళు సమర్పించాలి. సాయంత్రం పూట తులసి పూతలో దీపం వెలిగించండి. దీపం అరిపోయిన తర్వాత, తులసి కోట నుండి దానిని తీసివేయడం మర్చిపోవద్దు.
**లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, కనకధార స్తోత్రం మరియు లక్ష్మీ స్తోత్రం చదవడం ఉత్తమ మార్గం.
**శివుని అనుగ్రహం జీవితంలోని అన్ని బాధలను తొలగిస్తుంది. ఇది జీవితంలో అపారమైన ఆనందాన్ని మరియు శ్రేయస్సును కూడా ఇస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చేయండి. వీలైతే, పాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి.
**రాత్రిపూట ఇంటి వంటగదిని మురికిగా ఉంచడం, మురికి పాత్రలు ఉంచడం మాతా లక్ష్మి మరియు మాత అన్నపూర్ణకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. రోజూ వంటగదిని శుభ్రం చేసిన తర్వాతే నిద్రించండి.
Also Read: Good Luck Sign: మీరు ధనవంతులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook