Astro Tips for Money and Popularity: మనలో చాలా మంది డబ్బుతో పాటు ఫేమ్ కూడా కావాలనుకుంటున్నారు. కానీ దాన్ని సాధించలేరు. వారి గ్రహాల బలహీనత కారణంగా ఆ వ్యక్తులు ఎంత కష్టపడిన ఫేమస్ అవ్వలేకపోతున్నారు. అన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు వారి కీర్తి పెరుగుతుంది. అందుకు మీరు గ్రహాలను సంతోషం పెట్టడం అవసరం. తద్వారా గ్రహాల (planets) దయ మీపై ఉంటుంది. గ్రహాలను సంతోషపెట్టే మార్గాలేంటో చూద్దాం.
గ్రహాలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి?
సూర్యుడు: భానుడి ఆశీర్వాదం పొందాలంటే... రాగి పాత్రలోని నీటిని సేవించాలి. ఏలకుల వినియోగంతో సూర్య భగవానుడు కూడా సంతోషిస్తాడని నమ్ముతారు. జేబులో ఎర్రటి రుమాలు పెట్టుకోవడం ద్వారా సూర్యదేవుని కరుణ కూడా లభిస్తుంది. ఆదివారాలు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడు.
చంద్రుడు: క్రీము రంగు దుస్తులు ధరించడం వల్ల చంద్రుడు సంతోషిస్తాడు. మరోవైపు, వెండి పాత్రలను ఉపయోగించడం ద్వారా, చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. జేబులో తెల్లటి రంగు రుమాలు కూడా పెట్టుకోవాలి.
అంగారకుడు: రాగి పాత్రలు వాడితే.. అంగారకుడి అనుగ్రహిస్తాడు. ప్రకాశవంతమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా కుజుడు ప్రసన్నుడవుతాడు. అలాగే జేబులో ఎర్ర రుమాలు మాత్రమే పెట్టుకోవాలి. నుదుటిపై ఎర్రటి తిలకం పెట్టుకోవడం వల్ల కూడా అంగారకుడి అనుగ్రహం కలుగుతుంది.
బుధుడు: మెర్క్యూరీ ఆశీస్సులు పొందడానికి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. దీనితో పాటు, జేబులో ఆకుపచ్చ రుమాలు లేదా ఏదైనా చిన్న ఆకుపచ్చ గుడ్డ ఉంచండి. స్పోర్ట్స్ లుక్‌లో ఉండడం కూడా బుధుడిని సంతోషపరుస్తుంది.
బృహస్పతి: గురువును ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు దుస్తులు ధరించాలి. జేబులో పసుపు రంగు రుమాలు ఉంచండి. పసుపు పూల మాల ధరించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ప్రతి గురువారం కుంకుమ, పసుపు తిలకం రాయాలి.
Also Read: Lunar Eclipse 2022: 15 రోజుల్లో రానున్న చంద్రగ్రహణం... ఇది భారతదేశంలో కనిపించనుందా?
శుక్రుడు: రాక్షస గురువు శుక్రాచార్యుని అనుగ్రహం పొందాలంటే...వెండి, ప్రకాశవంతమైన తెల్లని బట్టలు ధరించండి. అలాగే, జేబులో మంచి నాణ్యమైన ప్రకాశవంతమైన తెల్లని రుమాలు ఉంచండి. తెల్లని పూల దండను మాత్రమే ధరించండి. వజ్రం, ప్లాటినం, తెలుపు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల శుక్రుని కరుణ లభిస్తుంది.
శని: సూర్యుని కుమారుడైన శనిని ప్రసన్నం చేసుకోవాలంటే నీలి రంగులో ఉండే దుస్తులు ధరించాలి. నలుపు రంగు చేతిరూమాలు జేబులో పెట్టుకోండి. దీనితో పాటు నలుపు రంగు వస్తువులను కూడా వీలైనంత ఎక్కువగా దానం చేయాలి.
రాహువు: రాహువును ప్రసన్నం చేసుకోవడానికి బూడిదరంగు వస్త్రాలు ధరించాలి. అంతేకాకుండా కుక్కలకు సేవ చేయడం కూడా ప్రభావవంతమైన మార్గం.
కేతువు: బహుళ వర్ణ వస్త్రాలు ధరించడం వల్ల కేతువు సంతోషిస్తాడు. జేబులో రంగు రుమాలు ఉంచండి. చేతి మణికట్టులో ఎరుపు రంగు కలవా ధరించాలి. కేతువు ధర్మ పతాకం కాబట్టి మత చిహ్నం శరీరంపై ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.