Magha Amavasya 2023: హిందూమతంలో అమావాస్య రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున ప్రజలు కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలి అమావాస్య రేపు జనవరి 21న రానుంది. పైగా ఆ రోజు శనివారం కాబట్టి దానిని శనిశ్చరి అమావాస్య లేదా శని అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది మాఘ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘ అమావాస్య అంటారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, ఇవాళ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూజలు చేస్తారు. అంతేకాకుండా కాలసర్పదోష నుంచి బయటపడటానికి ఈరోజు చాలా ప్రత్యేకం. ఈ రోజు మౌన వ్రతాన్ని పాటిస్తారు. అందుకే దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ రోజున శనిదేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.
మాఘ అమావాస్య: తిథి, సమయం
తేదీ: జనవరి 21, 2023 (శనివారం)
ముహూర్తం: ఉదయం 6:17 (జనవరి 21) నుండి తెల్లవారుజామున 2:22 (జనవరి 22) .
ఈ సంవత్సరంలో రాబోయే అమావాస్యలు:
మాఘ అమావాస్య: జనవరి 21, 2023, శనివారం
ఫాల్గుణ అమావాస్య: ఫిబ్రవరి 19, 2023, సోమవారం నుండి ఫిబ్రవరి 20, 2023, సోమవారం
చైత్ర అమావాస్య: మార్చి, 21, 2023, మంగళవారం
వైశాఖ అమావాస్య: ఏప్రిల్ 19, 2023, బుధవారం నుండి ఏప్రిల్ 20, 2023, గురువారం
జ్యేష్ఠ అమావాస్య: మే 19, 2023, శుక్రవారం
ఆషాఢ అమావాస్య: జూన్ 17, 2023, శనివారం
శ్రావణ అమావాస్య: జూలై 17, 2023, సోమవారం
శ్రావణ అధిక అమావాస్య: ఆగస్టు 15, 2023, మంగళవారం నుండి ఆగస్టు 16, 2023, బుధవారం
భాద్రపద అమావాస్య: సెప్టెంబర్ 14, 2023, గురువారం
అశ్విన అమావాస్య: అక్టోబర్ 14, 2023, శనివారం
కార్తీక అమావాస్య: నవంబర్ 13, 2023, సోమవారం
మార్గశీర్ష అమావాస్య: డిసెంబర్ 12, 2023, మంగళవారం
Also Read: Malavya Rajyog: మీన రాశిలో అరుదైన యోగం.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.