Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి

ధనవంతులు కావడానికి రాశిచక్రం ప్రకారం, రాళ్లను ధరిస్తే శుభప్రదం కదా.. అలాగే కొన్ని రాశుల వారికి లోహాలు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఇపుడు వాటి గురించి తెలుసుకుందాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 05:27 PM IST
  • మన జాతక చక్రాల ప్రకారం రంగు రాళ్లు మంచిని చేకూరుస్తాయి
  • లోహాలు, కాంస్యం కూడా కొన్ని రాశులకు మంచి చేకూరుస్తాయి
  • మన జాతక ప్రకారమే వీటిని ధరించటం శ్రేయస్కరం
Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి

Metal Astrology: జ్యోతిష్యశాస్త్రంలో మన రాశి ప్రకారం, భవిష్యత్తు లో జరగబోయే అశుభకర సంఘటనలు మరియు చెడు అనుభవాలను తెలుసుకొని వాటిని జరగకుండా ఆపవచ్చు. రంగు రంగు రత్నాలు లేదా రాళ్లు ధరించటం, పూజలు, మంత్రాలు పఠించడం వంటి దోష నివారణల ద్వారా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వీటికి సంబంధించిన అన్నిటి గురించి జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావించబడింది. 

ముఖ్యంగా జాతకం ప్రకారం సూచించబడిన రాళ్లను ధరించటం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు. మన జాతక చక్రం ప్రకారం, గ్రహాలను బలపరచి.. మంచి ఫలితాలను పొందటానికి రంగు రంగుల రాళ్లు ఉపయోగపడతాయి. కేవలం ఈ రంగు రాళ్లు మాత్రమే కాకుండా.. లోహాలు లేదా మెటల్ వస్తువులు కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. 

Also Read: Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

స్పెషల్ మెటల్ వస్తువులు కూడా ధనవంతులను చేస్తాయి.. 

రాశులు మరియు సమస్యలను బట్టి రాళ్లను ధరించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో, అలాగే రాశిని బట్టి లోహాలను ధరించడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ధనవంతులు కావాలంటే ఏ రాశి వారు ఏ లోహాన్ని ధరించాలో ఇపుడు మనం తెలుసుకుందాం.. 

మేషం : మేష రాశి వారు మంగళవారం నాడు బంగారం లేదా రాగిని ధరించాలి. ఇవి వారికి మంచి ఆదాయాన్ని సమకూరుస్తాయి. 

వృషభం : వృషభ రాశి వారు చండీని ధరించాలి. శుక్రవారం ఇది ధరించటానికి ఉత్తమ సమయం.

Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

మిథునం : మిథున రాశి వారికి కాంస్యం చాలా శుభప్రదం. బుధవారం నాడు ధరించడం మంచిది.

సింహ రాశి : సింహ రాశి వారికి బంగారం, రాగిని ధరించడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఈ రాశివారు ఆదివారం వీటిని ధరించటం ఉత్తమం.

కన్య : కన్యా రాశి వారికి బంగారం, వెండి శుభప్రదం. ఏ రోజునైనా ఈ రాశి వారు వీటిని ధరించవచ్చు.

తుల : తులారాశి వారికి వెండి శుభప్రదం. దీనిని ధరిస్తే మనశ్శాంతి తోపాటు ధనలాభం కూడా కలుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News