Viral Video: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం.. ర‌న్ వేపై సంచారం!

Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2021, 04:49 PM IST
  • పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది
  • శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం
  • ఎయిర్‌పోర్టులో చిరుత సంచరించినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది
Viral Video: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం.. ర‌న్ వేపై సంచారం!

Viral Video: Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. చిరుత సంచారం ఘటన వైరల్ అవుతోంది.

గత కొన్ని రోజులుగా శంషాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో సంచరించిన చిరుత.. ఆదివారం రాత్రి ఏకంగా ఎయిర్‌‌పోర్ట్‌లోకి ప్రవేశించి రన్ వే మీదకు వెళ్లింది. దాదాపు 10 నిమిషాలు అక్కడ సంచరింత చిరుత అనంతరం ర‌షీద్‌గూడ వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే Shamshabad ఎయిర్‌పోర్టులో చిరుత సంచరించినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. చిరుత సంచారం విషయం తెలియడంతో స్థానికులు హడలిపోతున్నారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

 

 

మరోవైపు శంషాబాద్ - తుక్కుగూడ మార్గంలో అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తున్నట్టుగా ఓ వ్యక్తి 100కు ఫోన్‌ చేశాడు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌(Shamshabad-Airport)లో సంచరించిన చిరుతను పట్టేందుకు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవల రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ చిరుతను అటవీ శాఖ పట్టుకోవడం తెలిసిందే.

Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News