Viral Video: 'పుష్ప' మేనియా తగ్గట్లేదుగా.. ఆఖరికి బుడ్డోడు కూడా అల్లు అర్జున్ హుక్ స్టెప్ ట్రై చేస్తుండు!!

Baby doing Srivalli hook step: తాజాగా ఓ బుడ్డోడు 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ని ప్రయత్నించాడు. ఇంట్లో టీవీలో వీడియో ప్లే అవుతుంటే.. బుడ్డోడు అల్లు అర్జున్‌ను అనుకరించే ప్రయత్నం చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 03:58 PM IST
  • బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన పుష్ప
  • ఏడ చూసినా పుష్ప మేనియానే
  • హుక్ స్టెప్ ట్రై చేసిన బుడ్డోడు
Viral Video: 'పుష్ప' మేనియా తగ్గట్లేదుగా.. ఆఖరికి బుడ్డోడు కూడా అల్లు అర్జున్ హుక్ స్టెప్ ట్రై చేస్తుండు!!

Allu Arjun youngest fan try to Srivalli hook step: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్‌' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏడ చూసినా.. ప్రస్తుతం పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలు పాడడం, టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ చేస్టున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ బాగా పాపులర్ అయింది. ఆ స్టెప్‌కి జనాలు ఫిదా అయిపోయారు.

'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ని చిన్నా పెద్దా తేడా లేకుండా వేస్తున్నారు. పెద్దవారు అచ్చు ఐకాన్ స్టార్‌ను దించేస్తుంటే.. చిన్న పిల్లలు తమ శక్తిమేర ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ బుడ్డోడు హుక్ స్టెప్‌ని ప్రయత్నించాడు. ఇంట్లో టీవీలో తెలుగులో వీడియో సాంగ్ ప్లే అవుతుంటే.. బుడ్డోడు అల్లు అర్జున్‌ను అనుకరించే ప్రయత్నం చేశాడు. ఫ్లోర్‌పై గుండ్రంగా తిరుగుతూ తన డాన్స్‌తో అలరించాడు. 

చిన్నారి హుక్ స్టెప్‌కి సంబందించిన వీడియోను 'కప్తాన్ హిందుస్థాన్' అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ చిన్న ఫ్యాన్' అని కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'ఈ అందమైన అభిమానిని చూడండి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఈ వీడియోను అల్లు అర్జున్, రష్మిక మందన్న కచ్చితంగా చూడాలి' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. బన్నీ తనలోని ఊరమాస్‌ యాంగిల్‌ను జనాలకు పరిచయం చేశాడు. చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ అతడు చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే.. అల్లు అర్జున్‌ తన నటనతో వన్‌ మ్యాన్‌ షో చేశాడు. శ్రీవల్లి పాత్రలో కన్నడ అందం రష్మిక తనదైన శైలిలో నటించారు. సునీల్, అనసూయ కూడా ఆకట్టుకున్నారు. 

Also Read: IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో మూడో వన్డే.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ!!

Also Read: Mahabubnagar: విషాదం.. మరో మూడు గంటల్లో పెళ్లి... ఇంతలో వరుడు మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News