Trending News: పెళ్లికి నాలుగు రోజుల ముందే భారత సాంప్రాదాయం ప్రకారం రుచికరమైన వంటలను వచ్చిన అథితులకు విందుగా పెడుతారు. ఇక పెళ్లి రోజైతే మాంసం, ఇతర పిండి వంటలను కూడా విందు కార్యక్రమంలో భాగంలో వడ్డిస్తారు. ఏది ఏమైన వంటకాలు పెళ్లిల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్యక్రమాలను బట్టి విందు కూడా మారుతూ ఉంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఓ పెండ్లిలో భోజన కార్యక్రమంలో జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రపంచంలో జరుగుతున్న వింత విశేషాలను తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా వింత సంఘటనలు, విషయాలను ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది నెటిజన్లు వైరల్ అవుతున్న వీడియోలను కూడా చూసేందుకు ఇష్టపడతారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని విందులో జరిగిన సంఘటన నెటిజన్లను తెగ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
MBA student came to eat food without being invited at a marriage ceremony in Madhya Pradesh, people forced him to wash utensils !!
मध्यप्रदेश के एक शादी समारोह में बिना बुलाए खाना खाने पहुंचा MBA का छात्र, लोगों ने युवक से धुलाए बर्तन !!
+ pic.twitter.com/XmBGr85aTy— Ashwini Shrivastava (@AshwiniSahaya) December 1, 2022
మీరు ఈ వీడియోను గమనిస్తే వివాహ కార్యక్రమంలో విందు కోసం గేట్‌ను మాత్రం లెక్క చేయకుండా వెళ్లిన సంఘటన మనం చూడొచ్చు. అంతేకాకుండా వీరంతా MBA విద్యార్థులే.. వారంతా పెళ్లి వారి పరిమిషన్ లేకుండా రావడంతో వివాహం తాలుకు వారు ఆగ్రహం వక్తం చేశారు. అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఎమిటంటే.. వారు ఆహారం తినాడనికి కావాల్సిన ప్లెట్స్ శుభ్రం చేసినవి అయిపోతవడంతో వారికి వారే నీటితో వాటిని శుభ్రం చేసుకుని భోజనాలు చేశారు.
ఈ వైరల్ అవుతున్న వీడియో భోపాల్‌లో జరిగిందని తెలుస్తోంది. వీరంతా ఓ కాలేజీలో MBA చదువుతున్న విద్యార్థులని సమాచారం. అయితే ఈ క్లిప్‌ను శ్రీవాస్తవా అనే సోషల్ మీడియా వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరైతే.. మీ తల్లిదండ్రులు డబ్బు పంపలేదా? మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేయడం మంచిదేనా అని కామెంట్ల రూపంలో చురకలు అంటిస్తున్నారు.
Also Read: King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి
Also Read: Jupiter Transit 2023: బృహస్పతి సంచారం.. కొత్త ఏడాదిలో ఈ ఆరు రాశుల వారికి అంతా శుభమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook