Kohli Viral Video: ఇండియా వర్సెస్ లీసెస్టర్‌షైర్ మ్యాచ్ సందర్బంగా విరాట్ కోహ్లి చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ వీడియోగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొడుతున్న విరాట్ కోహ్లీ దృశ్యమిది.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇండియా లీసెస్టర్‌షైర్ జట్టుతో వార్మ్‌అప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ పేలవంగా సాగుతున్నా..టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంకా బరిలోనే ఉండటం విశేషం. పూర్తి ఆత్మ విశ్వాసంతో ఆడుతూ భారీ స్కోర్ దిశగా టార్గెట్ చేసినట్టు కన్పిస్తున్నాడు విరాట్ కోహ్లి. విరాట్ కోహ్లీ ఫామ్‌లో వచ్చినట్టు కన్పించడం కంటే అతను చేసిన ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది. చర్చనీయాంశమైంది.
తొలి రోజు ఆట సందర్బంగా తన బ్యాట్‌ను స్ట్రైట్‌గా, ఏ విధమైన సపోర్ట్ లేకుండా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం కెమేరాకు చిక్కింది. వాస్తవానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌కు కాపీ ఇది. అతను ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే చేసి చూపించాడు. బ్యాట్‌ను నిటారుగా సపోర్ట్ లేకుండా నిలబెట్టాడు. అదే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లి ఇప్పుడు.
Kohli tried to make his bat stand upright like Root 😭 pic.twitter.com/PJh32dsDPH
— Chand (@AbhiShake_18) June 23, 2022
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కూడా ఇలాగే బ్యాట్‌ను బ్యాలెన్స్ చేసి నిటారుగా నిలబెట్టాడు. ఆ సీన్ కూడా అప్పట్లో వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోపై పెద్దఎత్తున స్పందిస్తూ..సోషల్ మీడియా వేదికలపై షేర్ చేశారు.
I knew @root66 was talented but not as magic as this……. What is this sorcery? @SkyCricket #ENGvNZ 🏏 pic.twitter.com/yXdhlb1VcF
— Ben Joseph (@Ben_Howitt) June 5, 2022
జో రూట్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే అతను టెస్ట్ క్రికెట్‌లో పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు. జో రూట్ బ్యాటింగ్‌పై ఇప్పటికే కోహ్లి, కేన్ విలియమ్సన్, స్టీవ్‌స్మిత్‌లు ప్రశంసలు కురిపించారు. జో రూట్ ప్రదర్శన కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంతో గెల్చుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.