Python Video Viral: భారీ కొండ చిలువ పరుగులు పెడుతూ స్థానికులను బెంబేలెత్తించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ 12 అడుగుల కొండచిలువ పాకుతూ పరేషన్ చేసింది. పక్కన ఏసీబీ కార్యాలయం, పంప్ హౌస్ ఉండడంతో అక్కడ పని చేసే ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది చేరుకుని కొండ చిలువను బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ
సంఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Cricket Betting: బెట్టింగ్‌లో రూ.5 కోట్ల నష్టం.. అత్తామామ ఆస్తి కోసం బావమరిది హత్య
విశాఖపట్టణంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయ సమీపంలో కొండచిలువ భయాందోళన కలిగించింది. జీవీఎంసీ జోన్ 2, 9వ వార్డు ఎండాడ, ఆదర్శనగర్ ప్రాంతంలో పంప్ హౌస్ ఉంది. శనివారం మధ్యాహ్నం పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్ నరేశ్ కిందకు దిగాడు. తీరా చూడగా ఆ గుంతలో 12 అడుగుల కొండచిలువ కనిపించింది. కొండ చిలువను చూసి ఒక్కసారిగా నరేశ్ బెంబేలెత్తిపోయాడు. కంగారుతో తేరుకునేలోపే కింద పడిపోయాడు.
Also Read: Attack On Minor Girl: ఏపీలో పెట్రేగిపోతున్న గంజాయ్ బ్యాచ్.. బాలికపై పాశవిక దాడి
వెంటనే అతడి వెంట ఉన్న సిబ్బంది అప్రమత్తమై నరేశ్‌ను పైకి లేపారు. కొండచిలువ సమాచారాన్ని పాములు పట్టే స్నేక్ కేచర్ కిరణ్‌కు సమాచారమిచ్చారు. ఆలోపు స్థానికులు కొండ చిలువను చూసేందుకు బారులు తీరారు. స్నేక్ సహాయకుడు కిరణ్ అక్కడకు చేరుకుని కొండచిలువను పట్టేందుకు గొయ్యిలోకి దిగాడు. కొండ చిలువను అతి కష్టంగా మచ్చిక చేసుకుని తన చేతిని చుట్టుకునేలా చేశాడు. అత్యంత జాగ్రత్తగా అనకొండను బంధించాడు. అనంతరం అటవీ ప్రాంతంలో దానిని వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరం నడిబొడ్డున అంతపెద్ద కొండ చిలువ కనిపించడంతో సిబ్బందిలో తీవ్ర భయాందోళన రేకెత్తింది. పొరపాటున చూడకుండా గొయ్యిలో దూకి ఉంటే ఏం జరిగి ఉండేదని సిబ్బంది ఊహించుకుంటేనే భయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.