Man cuts his own legs: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి

Man cuts his own legs for 24 crore insurance :పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బును దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సాండోర్ అనే హంగేరీకి చెందిన వ్యక్తి ఇన్సూరెన్స్ కింద లభించే రూ.24కోట్ల డబ్బు కోసం రైలు ట్రాక్‌పై పడుకున్నాడు. 2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ సపోర్టుతో బతుకుతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 02:49 PM IST
  • బీమా పాలసీలను క్లైయిమ్ చేసుకునేందుకు ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి
  • రూ.24కోట్ల డబ్బు కోసం పక్కా ప్లాన్
  • సాండోర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశాడన్న కోర్టు
  • రెండేళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల రూపాయల జరిమానా
Man cuts his own legs: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి

Man cuts his own legs under train for 24 crore insurance now is in jail: జీవిత బీమా అనేది అనుకోని ఆపద కారణంగా భవిష్యత్తులో సంభవించే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఎంపిక చేసుకునే ఓ ఆర్థిక సాధనం. అయితే కొందరు దీన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. బీమాను భవిష్యత్తు ధీమా కోసం కాకుండా, తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకోవాలనుకుంటూ ఉంటారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతుంటారు. ఇన్సూరెన్స్ (insurance) డబ్బుల కోసం తప్పుడు మార్గాలు (Wrong ways) ఎంచుకుంటూ ఇబ్బందులపాలవుతుంటారు. 
ఇలాంటి ఘటన ఒకటి హంగరీలో చోటుచేసుకుంది. 

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక వ్యక్తి తన కాళ్లను (legs) తానే కోల్పొయేలా చేసుకున్నాడు. కొన్ని బీమా పాలసీలను చెల్లించిన వ్యక్తి.. వాటిని క్లైయిమ్ చేసుకునేందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బును (Rs 24 crore) దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సాండోర్ అనే హంగేరీకి (Hungary) చెందిన వ్యక్తి ఇన్సూరెన్స్ కింద లభించే రూ.24కోట్ల డబ్బు కోసం రైలు ట్రాక్‌పై (Train track‌) పడుకున్నాడు.

2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ (Wheelchair) సపోర్టుతో బతుకుతున్నాడు. అయితే ఆ ఘటన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆ కంపెనీలను సంప్రదించాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు (Insurance companies) అతనిపై అనుమానం వ్యక్తం చేశాడు. ప్లాన్ ప్రకారమే అతను ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో ఎంక్వైరీ చేపట్టాయి. 

Also Read : Delhi Lockdown News: ఢిల్లీలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. లాక్ డౌన్ తప్పదా?

కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ (High Risk Life Insurance) పాలసీలను తీసుకున్నాడు సాండోర్. అయితే ఈ పాలసీలు అన్నీ కూడా ఒకేసారి తీసుకోవడంతో ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమానం వచ్చింది. క్లెయిమ్‌ను కొంతపాలం పాటు వాయిదా వేశాయి. కానీ అతను తనకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు చెల్లించడం లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో అసలు నిజం బయటపడింది.
తనపై గ్లాస్ మీద పడటంతో జారి రైలు పట్టాల మీద పడ్డాడని.. అదే సమయానికి రైలు కాళ్ల మీద నుంచి వెళ్లిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే అవేవీ రుజువు కాలేదు. చివరకు అతను కోర్టులో నిజాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్‌కు నో చెప్పేశాయి. 

Also Read : Amit Shah, YS Jagan : అమిత్‌ షాను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఇక సాండోర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశాడని కోర్టు (Court) తీర్పు ఇచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఆ వ్యక్తి స్వయంగా ప్రమాదానికి పాల్పడ్డాడని కోర్టు పేర్కొంది. దీంతో సాండోర్‌కు రెండేళ్ల జైలు శిక్ష (jail) విధించింది కోర్టు. అలాగే కోర్టును (Court) మోసం చేసినందుకు గాను రూ.4 లక్షల రూపాయల జరిమానా (Fine) కూడా విధించింది.

Also Read : 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News