Jaguar in School Bathroom: స్కూల్ టాయిలెట్ లో జాగ్వర్.. భయంతో పారిపోయిన విద్యార్థి!

Jaguar in School Bathroom: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఓ పాఠశాలకు వెళ్లిన విద్యార్థికి భయంకరమైన సంఘటన ఎదురైంది. మ్యాచ్ విరామ సమయంలో టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థికి జాగ్వర్ కంటపడింది. దీంతో అతడు భయంతో అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 12:39 PM IST
Jaguar in School Bathroom: స్కూల్ టాయిలెట్ లో జాగ్వర్.. భయంతో పారిపోయిన విద్యార్థి!

Jaguar in School Bathroom: మీ పాఠశాలలో జరిగిన అత్యంత షాకింగ్ సంఘటన మీకు గుర్తుందా? బహుశా డేవిడ్ మిగ్యుల్ అనే విద్యార్థి అనుభవం కంటే దిగ్భ్రాంతికరమైనది మరొకటి ఉండదు. బ్రెజిల్‌కు చెందిన 9 ఏళ్ల బాలుడు జాగ్వార్‌ కంటపడ్డాడు. 

బ్రెజిల్ లోని మార్తా డ్రమ్మండ్ ఫోన్సెకా మున్సిపల్ స్కూల్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు మార్చి 21న డేవిడ్ మిగ్యుల్ అక్కడికి వచ్చాడు. విరామం సమయంలో అతను బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ జాగ్వర్ నక్కి ఉంది. దాన్ని చూసి భయాందోళనతో పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. 

స్కూల్ టాయిలెట్‌లో జాగ్వర్..

జాగ్వర్ లేదా ఏదైనా క్రూర జంతువు కంటపడినప్పుడు ఎవరైనా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. మిగ్యూల్ కూడా అదే పని చేశాడు. వెంటనే ఆ విషయాన్ని తన తండ్రి రోడ్రిగో అల్మేడాకు తెలియజేశాడు. 

ఆ వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జాగ్వర్ ను పట్టుకున్నారు. అనంతరం తిరిగి అడవిలోకి వదిలేశారు. దీని తర్వాత డేవిడ్ మిగ్యుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. "జాగ్వార్‌ను చూసి నేను వణికిపోయాను. కేకలు వేయడం ప్రారంభించాను. ఆ సమయంలో నా గుండె దాదాపు ఆగిపోయినంత పనైంది" అని చెప్పాడు. 

Also Read: Lizard in McDonalds: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్ లో బల్లి ప్రత్యక్ష్యం.. రెస్టారెంట్ ను సీజ్ చేసిన అధికారులు!

Also Read: Instagram Reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని ఈ అమ్మాయి చాలా సులభంగా చేసేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News