Old 100 Note: లక్కంటే ఇదే! ఒకే ఒక వంద నోటుకు ఏకంగా రూ.56 లక్షలు

Jackpot Old Rs 100 Note Sold For Rs 56 Lakhs In Auction: కరెన్సీ నోటు ఎంత పాతపడితే.. నాణెం ఎంత పురాతనమైదో అంత విలువ ఉంటుంది. ఓ వంద రూపాయల నోటు ఏకంగా అర కోటికి పైగా విలువ పలికింది. లక్కంటే ఆ నోటు కలిగిన వారిదే!

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 12, 2025, 01:09 PM IST
Old 100 Note: లక్కంటే ఇదే! ఒకే ఒక వంద నోటుకు ఏకంగా రూ.56 లక్షలు

100 Note Sold For Rs 56 Lakhs: పాతపడ్డ కొద్దీ విలువ పెరుగుతుంది అంటే ఇదే కావొచ్చు. దశాబ్దాల కాలం నాటి కేవలం వంద రూపాయల నోటుకు ఏకంగా రూ.56 లక్షలు దక్కాయంటే ఇది మామూలు జాక్‌పాట్‌ కాదు. చలామణీలో లేని పాత నోటుకు అత్యధిక ధర లభించింది. నోటు విలువ వందనే కాదు ఇప్పుడు పలికిన రేటు మాత్రం అర కోటికి పైగా పలికింది. ఈ వార్త ట్రేడ్‌ మార్కెట్‌లో సంచలనం రేపింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం

ప్రపంచ మార్కెట్‌లో కొన్ని వెబ్‌సైట్లు పాత నోట్లు, నాణేలు కొనుగోలు చేస్తుంటాయి. పాత నోట్లు, నాణేలకు భారీ విలువ ఉంటుంది. ఆన్‌లైన్‌ వేదికగా జరిగే వేలం పాటల్లో పురాతన నగదుకు భారీ విలువ పలుకుతుంటుంది. పాత కరెన్సీ.. పాత కరెన్సీ నోట్లకు ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లకన్నా అత్యధిక విలువ ఉంటుంది. పాత కరెన్సీ, నాణెల్లో ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటే వాటికి విలువ మరింత పెరుగుతుంది. దీంతో ఆ నోటు.. ఆ నాణేలు కలిగి ఉన్న వారికి భారీగా డబ్బులు వస్తుంటాయి.

Also Read: Jio: జియో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌తో BSNLకు గట్టిపోటీ.. పైసా ఖర్చులేకుండా ఓటీటీలు ఫ్రీ..

లండన్‌లో జరిగిన ప్రత్యేక వేలంపాటలో వంద రూపాయల నోటుకు భారీగా ధర పలికింది. వేలంలో రూ.56,49,650కి రూ.వంద నోటు అమ్ముడైంది. 1950లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసిన 'హజ్‌ నోట్‌' దీని సీరియల్‌ నంబర్‌ హెచ్‌ఏ 078400. హజ్‌ కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఈ నోటును విడుదల చేశారు. బంగారన్ని అక్రమ కొనుగోలు నుంచి నిరోధించడానికి ఈ నోటును ప్రవేశపెట్టారు.

అయితే ఈ నోట్లు భారతదేశంలో చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. హెచ్‌ఏ ద్వారా ఈ నోట్లు వేరు చేయబడ్డారు. ఈ నోట్లు భిన్నమైన రంగులో ఉంటాయి. వంద రూపాయల నోటును గల్ఫ్‌ దేశాలైన యూఏఈ, ఖతర్‌, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌లో ఈ నోట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే 1961లో కువైట్‌ ప్రభుత్వం సొంత కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో 1970 నుంచి 
ఈ నోట్లు చలామణీలో లేకుండా అయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News