Hyundai showroom: ఒకప్పుడు వీధి కుక్క.. ఇప్పుడు షోరూంలో సేల్స్ డాగ్

మీరు ఓ కార్ల షూరూంలోకి వెళ్లగానే... అక్కడ ఓ శునకం ( Dog as sales executive ) వచ్చి మీకు విష్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది కూడా ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న శునకం అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా బిజీబిజీగా కనిపిస్తే చూడ్డానికి ఆ సీన్ ఇంకెలా ఉంటుంది

Last Updated : Aug 5, 2020, 08:40 PM IST
Hyundai showroom: ఒకప్పుడు వీధి కుక్క.. ఇప్పుడు షోరూంలో సేల్స్ డాగ్

మీరు ఓ కార్ల షూరూంలోకి వెళ్లగానే... అక్కడ ఓ శునకం ( Dog as sales executive ) వచ్చి మీకు విష్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది కూడా ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న శునకం అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా బిజీబిజీగా కనిపిస్తే చూడ్డానికి ఆ సీన్ ఇంకెలా ఉంటుంది!! బ్రెజిల్‌లోని ఓ హ్యుందాయ్‌ షోరూంకి ( Hyundai Showroom ) వెళ్తే.. అటువంటి సీన్సే కనిపిస్తాయి. ఎందుకంటే ఓ హ్యూందాయ్ షోరూం యాజమాన్యం ఓ వీధి కుక్కను ( Street dog ) దత్తత తీసుకుని దానిని తమ సేల్స్‌పర్సన్‌గా నియమించింది. అంతేకాకుండా ఆ శునకానికి టక్సన్‌ ప్రైమ్‌ ( Tucson prime ) అని పేరు పెట్టి దాని మెడలో ఒక ఎంప్లాయి ఐడీ కార్డును కూడా తగిలించారు. దాని పనికి మెచ్చి అవార్డు కూడా కట్టబెట్టారు. 

ఈ శునకం ఎక్కడిది ? ఎందుకు దత్తత తీసుకున్నారు ?
ఈ శునకం షోరూం పరిసరాల్లోనే తచ్చాడుతూ.. షోరూం నుంచి బయటకు వచ్చే ఉద్యోగులనే అనుసరిస్తూ తిరుగుతూ ఉండేదట. ఆ శునకం వాలకాన్ని గమనించిన షోరూం నిర్వాహకులు.. దానిని చేరదీసి దత్తత తీసుకుని వెరైటీగా దానికి ఓ ఉద్యోగం ఇచ్చారు. షోరూం ఆవరణలో దాని కదలికలను ఫోటోలు, వీడియోలు తీసి దాని పేరు మీదే ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అందులో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకేం... ప్రస్తుతం సోషల్ మీడియాలో టక్సన్‌ ప్రైమ్‌ ఓ సంచలనంగా మారింది. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 44 వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

Trending News