Fast Time Rescue Indian Rock Python: ప్రపంచంలో ఎన్నో జాతులకు చెందిన పాములు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాణాంతకం అయితే మరికొన్ని మాత్రం జంతువులకు, మనుషులకు ఎలాంటి హాని కలిగించనివి..మనం తరచుగా కింగ్ కోబ్రాలు ఇతర పాములను చూసి ఉంటాం. అయితే కొన్ని పాములు భారీ ఆకారంతో కూడుకొని చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. భారీ ఆకారం కలిగిన పాములు ఎక్కువగా ఆమెజాన్ అడవి ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉంటాయి. వీటిని చాలా మంది కొండచిలువలు అంటారు. ఈ పాములు అన్నింటికంటే మూడింతలు ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా జంతువులపై దాడి చేసి వాటిని అమాంతం తిన గలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
కానీ ప్రస్తుతం ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో జరిగే మార్పుల కారణంగా చాలావరకు కొండచిలువల జాతులు అడుగంటుకు పోతున్నాయి. వీటిని రక్షించడానికి ప్రస్తుతం అనేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా అడవి ప్రాంతాల్లో జీవించే చాలామంది వీటిని రక్షిస్తున్నారు. అయితే ఇటీవలే ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది ఓ భారీ కొండచిలువను ప్రమాదం నుంచి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
వీడియో వివరాల్లోకి వెళితే.. అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలోకి పాములు ఇతర విషయ సర్పాలు రావడం సాధారణం. అయితే ఓ భారీ కొండచిలువ కూడా జనజీవన స్రవంతి లోకి వచ్చింది. అయితే దీనిని చూసిన కొంతమంది అక్కడి జనాలు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని పాములు జనాల నుంచి రక్షించేందుకు పట్టుకునేందుకు ప్రయత్నించారు అయితే ఈ సమయంలో అనేకసార్లు ఆ భారీ కొండచిలువ స్నేక్ క్యాచర్లపై దాడి చేయాలని చూసింది అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా వారు ఆ పామును పట్టుకుని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ షార్ట్స్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు స్నేక్ క్యాచర్లను అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి