చిరుత Vs పాము.. 'తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడుంటాడు' అంటే ఇదే! వైరల్ వీడియో

కప్పను వేటాడుతున్న పాము.. హీరోలా చిరుత పిల్ల ఎంటర్ అయింది.. తరువాత ఏం జరిగిందో ఈ వైరల్ వీడియోలో మీరే చూసేయండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 04:15 PM IST
  • కప్పను వేటాడబోతున్న పాము..
  • సీన్ లోకి ఎంటర్ అయిన చిరుత పిల్ల
  • తన పంజాతో పాము పని చేసిన చిరుత
చిరుత Vs పాము.. 'తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడుంటాడు' అంటే ఇదే! వైరల్ వీడియో

Cheetah Protect Frog From Snake Video Goes Viral: అడవిలో చాలా వింతలు - విడ్డురాలు జరుగుతుంటుంటాయి.. కొన్ని కెమెరా చిక్కితే మరి కొన్ని తెలియకుండానే ముగుస్తాయి. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవుటుతుంటాయి. అడవిలో సాధారణంగా క్రూర మృగాలు, అమాయక సాదు జంతువులను వేటాడుతాయి.. అది జీవన చక్రం.. కానీ అపుడపుడు కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వింతే ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. 

అదేంటంటే.. ఒక క్రూర జంతువు.. మరో క్రూర జంతువు దాడి చేస్తుంటే... మరో సాదు జంతువును కాపాడింది.. ఇక్కడ సాధు జంతువు కప్ప.. దాడి చేసిన జంతువు పాము కాగా.. కాపాడిన మరో క్రూర జంతువు చిరుత పిల్ల.. 

పాములు సాధారణంగా పురుగులను, ఎలుకలు, చిన్న కీటకాలు, కప్పలను వేటాడుతుంటాయి.. ఇది సర్వసాధారణం.. అలాగే ఒక పాము కప్పను వేటాడబోతుంటే.. మధ్యలో చిరుత పిల్ల కలగచేసుకొని.. కప్పను కాపాడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

Also Read: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణకు కారణం ఏంటి..? జగన్ ప్రభుత్వం ముందున్న 4 ఆప్షన్స్

ఒక పాము కప్పను వేటాడే పనిలో భాగంగా.. నోటితో కప్పు కాలును లాగటానికి ప్రయత్నిస్తుంది.. అపుడే మన హీరో చిరుత పిల్ల ఎంటర్ అయింది.. కప్ప కాలు లాగుతున్న పాము తలపై పంజా విసిరింది.. కప్పను వదిలేసిన పాము కదులుతున్న తోకను ఇంకో కాలుతో పట్టుకుంది చిరుత.. తరువాత బుస కొడుతున్న పామును రెండు చేతులతో పట్టుకొని.. చిరుత లాగించేసింది.. కప్ప మాత్రం చాలు రా బాబు.. మళ్లీ ఇటుపక్క రాను అన్నట్టుగా వెళ్ళిపోయింది.. 

'wonderfuldixe' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 8.58 లక్షలకు పైగా వ్యూస్ రావటం.. ఫన్నీ కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్ హోరెత్తిపోతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరీ!

Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News