Cat vs Crow Fight: తెలివైన వ్యూహంతో పిల్లిని మోసం చేసిన కాకులు- వీడియో వైరల్

Cat vs Crow Fight: పక్షుల్లో కాకి చాలా తెలివైనది. ఆహారాన్ని పొందేందుకు ఎలాంటి ప్లాన్స్ అయినా అమలు చేస్తాయి. చివరికి అవి దక్కించుకోవాలనుకున్న ఆహారాన్ని పొంది తీరుతాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు కాకులు తెలివిగా పిల్లిని మోసం చేసి ఆహారాన్ని ఎత్తుకెళ్లాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 07:56 AM IST
    • తెలివిగా పిల్లిని మోసం చేసిన రెండు కాకులు
    • ఆహారం కోసం పిల్లిని తిప్పలు పెట్టిన కాకులు
    • అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Cat vs Crow Fight: తెలివైన వ్యూహంతో పిల్లిని మోసం చేసిన కాకులు- వీడియో వైరల్

Cat vs Crow Fight: పక్షుల్లో కెల్లా కాకులు చాలా తెలివైనవి. ఎందుకంటే ఆహారాన్ని వెతకడంలో అవి చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అనేక సార్లు ఆహారం కోసం కాకులు గుంపులు, గుంపులుగా వెళ్లి అనుకున్నది సాధిస్తాయి. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాకులు అనేక జంతువులను ఆటపట్టించడం మనలో చాలామంది గమనించే ఉంటారు. కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులు ఏమైనా తినే సమయంలో కాకులు వాటిని రెచ్చగొట్టి, వాటికి కోపం వచ్చేలా చేస్తాయి. చివరికి ఆ జంతువులకు కోపం తెప్పించి, ఆహారంతో అక్కడి నుంచి కాకులు ఉడాయిస్తాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

వీడియోలో ఏముందంటే?

ఓ కారు పార్కింగ్ ఏరియాలో పిల్లి తన ఆహారాన్ని తింటూ ఉంది. దాన్ని గమనించిన రెండు కాకులు అటుగా వచ్చాయి. అయితే ఆ ఆహారాన్ని పంచిపెట్టేందుకు పిల్లి నిరాకరించింది. దాంతో పిల్లి దగ్గర నుంచి ఆహారాన్ని కొట్టేయాలని ఆ రెండు కాకులు పన్నాగం పన్నాయి. వాటిలో ఒక కాకి.. పిల్లి వెనుకగా వచ్చి పొడుస్తుంది. దాంతో ఆ పిల్లికి కోపం వచ్చి తింటున్న ఆహారాన్ని పక్కన పెట్టేసి.. ఆ కాకితో గొడవ పడేందుకు వెళ్తోంది. 

ఇంతలో ఖాళీగా ఉన్న రెండో కాకి.. పిల్లి వదిలేసిన ఆహారాన్ని తస్కరించింది. అయితే పిల్లి ఆ విషయాన్ని గమనించే లోపు జరగరానిది జరిగిపోయింది. తన ఆహారాన్ని కాకులు తస్కరించాయిని తెలుసుకున్న పిల్లి.. దిగాలుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫన్నీ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.  

Also Read: Tiger Hunting underwater: నీటి అడుగున వేటాడే చిరుత పులిని చూశారా?

Also Read: Funny Accident Video: ఈ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో మీరే కనిపెట్టండి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News