Rare Accident : గాల్లోకి ఎగిరి ఇంటి పై కప్పుని ఢీకొట్టిన కారు

Car Driver Hits House Roof In USA : అందరినీ అవాక్కయ్యేలా చేస్తోన్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్నీ హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాం కానీ రియల్ లైఫ్ లో కూడా చూస్తాననుకోలేదని.. కానీ ఈ ఒక్క ఘటనతో ఆ కోరిక కూడా తీరిపోయింది అని నెటిజెన్స్ జోక్స్ వేసుకుంటున్నారు.

Written by - Pavan | Last Updated : Aug 10, 2023, 11:14 PM IST
Rare Accident : గాల్లోకి ఎగిరి ఇంటి పై కప్పుని ఢీకొట్టిన కారు

Car Driver Hits House Roof In USA: ఇంటి పై కప్పులోకి కారు దూసుకుపోయినట్టుగా ఉన్న ఈ ఫోటోలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదా.. జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఫోటోలు కానీ లేదా వీడియోలు కానీ చూడలేదు కదా.. ఔను ఈ పోటోలు చూస్తే చాలామందికి కలిగే ఫీలింగ్ ఇదే. విచిత్రం ఏంటంటే.. కారు అంత ఎత్తులోకి గాల్లోకి ఎలా ఎగిరి వెళ్లింది అనేదే చాలామందికి మొదట కలుగుతున్న సందేహం. అంతేకాదు.. ఇంటిపైకప్పుని ఢీకొన్న కారు అక్కడే ఎలా బ్యాలెన్స్ అయింది ? ఆ సమయంలో కారులో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి ? ఇలా ఈ ఫోటోలు చూసిన వాళ్లకు సవాలక్ష సందేహాలు వారి మెదళ్లను తొలిచేస్తున్నాయి. 

ఇంతకీ ఇంత వెరైటీ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుంది అనే కదా మీ తరువాతి సందేహం.. యస్ అక్కడికే వస్తున్నాం. అమెరికాలోని పెన్సిల్వేనియాలో అల్ఫారటా రోడ్డులోని 800 బ్లాక్‌లో ఆదివారం నాడు మధ్యాహ్నం  3.15 గంటలకు ఈ కారు యాక్సిడెంట్ జరిగింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ఇంటికి సమీపంలోనే ఉన్న కల్వర్టును ఆ కారు డ్రైవర్ ప్రమాదవశాత్తుగా ఢీకొట్టాడు. అప్పుడు కారు కూడా వేగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కల్వర్ట్ ని ఢీకొన్న కారు అమాంతం గాల్లోకి ఎగిరి వెళ్లి ఇంటిపై కప్పుని ఢీకొంది. 

అకస్మాత్తుగా భారీ శబ్ధం రావడంతో ఆ వీధిలోని వాళ్లంతా అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఇక ఆ ఇంటి వారి పరిస్థితి అయితే చెప్పనక్కరేలేదు. ఇంటిపై పిడుగు పడిందా అన్నట్టుగా ఢబేల్మని వినిపించిన భారీ శబ్ధం విని షాకయ్యారు. వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చి చూసే వరకు ఈ సీన్ కనిపించింది. తమ ఇంటిపై కారు పడటం చూసి వారికి నోట మాట రాలేదు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్ ని అతికష్టంమీద వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని గీసింగ్ లూయిస్‌టౌన్ ఆసుపత్రికి తరలించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News