Facebook Alert: ఫేస్బుక్ ఇప్పుడొక బలమైన సోషల్ మీడియా ఆయుధం. ప్రతి ఉదయం ఫేస్‌బుక్‌తోనే తెల్లారడం సాధారణమైపోయింది. అందుకే ఫేస్‌బుక్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. ఫేస్బుక్ వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.
దేశంలో ఫేస్బుక్ వాడే వినియోగదారులకు(Facebook Users) భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ( Indian Cyber Security Agency) అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తలు సూచిస్తోంది. ఫేస్బుక్ వినియోగదారులు తమ అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్ మరింత బలోపేతం చేసుకోవాలని సీఈఆర్టీఇన్ సూచించింది. ఇటీవలే ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌పై ( Attack on Facebook Platform) జరిగిన డేటా దాడి 61 లక్షల భారతీయుల అకౌంట్లపై పడిన సందర్భంగా ఏజెన్సీ ఈ సూచన చేసింది. ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నకొద్దీ యూజర్ల అకౌంట్లు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయని, ఇలాంటప్పుడు యూజర్ల డేటాను వారికి తెలియకుండానే సేకరించడం జరుగుతుందని ఏజెన్సీ హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ప్రొఫైల్ సమాచారం లీకేజ్ ( Facebook Profile date leakage) భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలా లీకయ్యే సమాచారంలో ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ ఐడీలు, పేర్లు, వృత్తి వివరాలు, ఫోన్ నంబర్లు, జన్మతేదీలు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య సమాచారం, పాస్వర్డ్స్ వివరాలు లేవని ఫేస్బుక్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది సమాచారం ఇందులో 61 లక్షల భారతీయుల వ్యక్తిగత సమాచారంతో సహా సైబర్ క్రిమినల్ ఫోరమ్స్‌లో ఉచితంగా లభిస్తోందని ఏజెన్సీ తెలిపింది. ఈ లీకేజీ కారక టెక్నాలజీ ఫీచర్‌ను సరిదిద్దామని ఫేస్బుక్ పేర్కొంది. లీకైన సమాచారం మొత్తం 2019కి ముందు జరిగిందని వివరించింది.
అందుకే ఫేస్బుక్లో ప్రైవసీ సెట్టింగ్స్(Facebook Privacy settings) ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, పాస్వర్డ్ మార్చుకోవడం చేస్తుండాలని ఫేస్బుక్ సూచిస్తోంది. ఇప్పటికే నకిలీ ఫేస్బుక్ ఎక్కౌంట్స్తో డబ్బులు కాజేసే వ్యవహారం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఫేస్బుక్ వినియోగదారులు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
Also read: Sim Numbers: మీ పేరున ఎన్ని మొబైల్ సిమ్‌లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook