Family Hospitalised: కుటుంబంతో కలిసి వివాహ వార్షికోత్సవం చేసుకుందామని భార్యాభర్తలు ఓ మండీ హోటల్‌కు వెళ్లారు. తమకు ఇష్టమైన భోజనం ఆర్డర్ చేసి తిన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ తమ పెళ్లి రోజు జ్ఞాపకాలు చేసుకుంటూ భోజనం చేశారు. తిని ఇంటికి వెళ్లాక ఆ కుటుంబం మొత్తం తీవ్ర అస్వస్థతకు గురయింది. విరేచనాలు, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించగా మండీ తినడంతోనే అస్వస్థతకు గురయ్యినట్లు తేలింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Statue Of Liberty: మారుమూల గ్రామానికి చేరిన ప్రపంచ వింత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి నరేందర్, మంగమ్మ ఈనెల 22వ తేదీన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. పెళ్లి రోజు కావడంతో బుధవారం రోజు తన కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌లోని ఓ మండీ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం పూట వెళ్లి కుటుంబంతో కలిసి మండీ హోటల్‌లో ఇష్టమైన వంటకాలు ఆరగించారు. ఇంటికి చేరుకున్న తర్వాత మొదట నరేందర్ రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నారు. కంగారుపడిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ తర్వాత కుటుంబసభ్యులు దీక్షిత, తన్విక, అనిరుధ్, అభిలాష్, జ్యోష్ణ, సాయి శ్రీఖర్ ఇలా మొత్తం 8 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.
Also Read: Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు
వారంతా కూడా ఆస్పత్రిలో చేరడం షాద్‌నగర్‌లో కలకలం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. కోలుకున్న అనంతరం హోటల్ నిర్వాహకులపై బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా తెలంగాణలో హోటల్, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆహార భద్రతా అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లతో సహా అన్నింటిపై దాడులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న ఆహారాలు, గడువు తీరిన పదార్థాలు, కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. ఇక రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనతో షాద్‌నగర్‌లోనూ కూడా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా హోటల్‌లో ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలలకోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే హోటల్ నిర్వాహకులు శుభ్రతా చర్యలు పాటిస్తారని పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter