Ram Charan - RC16 Pooja Ceremony: అట్టహాసంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కొత్త చిత్రం ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరంజీవి..

Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త చిత్రం అట్టహాసంగా హైదరాబాద్‌ వృద్ధి సినిమా ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్‌, అల్లు అరవింద్, శంకర్, దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు ఈ పూజా ార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.

 

1 /8

రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో,హీరోయిన్లు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు. బోనీ కపూర్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు.

2 /8

శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్  అల్లు అరవింద్ చేతులు మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.

3 /8

ఈ కార్యక్రమానికి చిరంజీవి, బోనీ కపూర్, ఏఆర్ రెహమాన్, శంకర్, అల్లు అరవింద్, సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ అచంట, నాగ వంశీ తదితరులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

4 /8

వృద్ధీ సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

5 /8

ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

6 /8

చాలా యేళ్ల తర్వాత ఈ సినిమాతో ఏఆర్ రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీటైంది.

7 /8

పూర్తి విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథానాయిక పాత్రకు మంచి స్కోప్ ఉంది.

8 /8

త్వరలోనే రామ్ చరణ్, బుచ్చిబాబుల సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.