YSRCP Sarpanch slaps him self: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం జరిగిన ఇరవై ఒక్క ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. ఈ 21 స్థానాల్లో నాలుగు స్థానాలు ప్రతిపక్ష టీడీపీ గెలుచుకుంటే దాదాపు 17 స్థానాలను అధికార వైసీపీ చేజిక్కించుకుంది.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తాము బలపడ్డామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మాత్రం అదేమీ లేదని 17 స్థానాలు తమకు వచ్చాయి కాబట్టి తామే బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సొంత పార్టీ నేతలే వైసీపీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన ఒక సర్పంచ్ చేసిన పని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఏపీ సర్పంచుల సంఘం సమావేశం జరిగింది.
Also Read: Akanksha Dubey Death:నటి మృతి కేసు.. సింగర్ అరెస్ట్.. సీసీ ఫుటేజ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
ఈ సమావేశంలో పాల్గొన్న ఒక వైసీపీకి చెందిన సర్పంచ్ తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే సర్పంచ్ లు అందరితోపాటు వేదిక మీద కూర్చున్న సర్పంచ్ రమేష్ తన కాలి చెప్పులు తీసి తన చెంపలపై వరుసగా కొట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చిన్నంపల్లి గ్రామానికి సర్పంచ్ గా రమేష్ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చిన్నంపల్లికు గత కొన్నాళ్లుగా పంచాయతీ నిధులు రావడం లేదని, ఆ నిధుల వ్యవహారంలోనే సర్పంచ్ రమేష్ చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇప్పటికైనా నిధులు మంజూరు చేయాలని రమేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. పంచాయతీ నిధులు విడుదల కాకపోవడంతో తాము తీవ్రంగా స్థాయిలో ఇబ్బందులు పడుతున్నామని పదవి ఉన్నా సరే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసైనా పంచాయతీకి నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు. ఇక ఈ సమావేశానికి హాజరైన ఇతర సర్పంచ్ ల సైతం నిధులు వ్యవహారంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లి తక్షణమే పంచాయతీ నిధులు విడుదల చేయించాలని కోరారు.
Also Read: Origin of Tollywood: టాలీవుడ్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత పెద్ద కధ ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook