Tea Seller Peeing Urine in Tea Cup Video got Viral: ఛాయ్ అంటే పేదోడి నుంచి ఉన్నోడి వరకు అలసట తీర్చుకునే దివ్య ఔషదం. ఇంకొంతమందికి అది అతి వేగంగా పనిచేసే తలనొప్పి నివారిణి. పనిచేసే సమయంలో మధ్య మధ్యలో ఛాయ్ లేకపోతే.. ఆ పని ముందుకు సాగదు అని అనుకునే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. పనిచేసే సమయంలో మధ్య మధ్యలో ఓ బ్రేక్ తీసుకుని వేడివేడిగా ఓ ఛాయ్ తాగకపోతే.. ఏదో తెలియని వెలితి. ఏదో కోల్పోయిన భావన చాలా మందిని వెంటాడుతుంటుంది. అందుకే కార్మికుడి నుంచి కార్పొరేట్ సీఈఓల వరకు ఛాయ్ కంపల్సరీ.
సిగరెట్ లేకుంటే రోజు గడవడం కష్టం అనుకునే పొగరాయుళ్లలో కూడా చాలామందికి సిగరెట్ తో పాటు ఛాయ్ తప్పనిసరిగా కావాల్సిందే. నాన్-వెజ్ ప్రియులకు ముక్క లేనిదే బుక్క దిగదు అని ఎలాగైతే చెప్పుకుంటామో.. అలాగే కొంతమంది పొగరాయుళ్లకు దమ్ము దమ్ముకి మధ్య ఒక ఛాయ్ సిప్ లేకుండా సిగరెట్ ఎక్కదు అంటుంటారు. అయితే కారణాలు ఏవైనా.. పరిస్థితులు ఏవైనా.. ఇంటికి దూరంగా ఉండి బయట ఛాయ తాగాల్సి వచ్చిన వాళ్లు ఎవరైనా ఇలాంటి వీడియోలు చూస్తే ఇకపై బయట ఛాయ్ అస్సలే తాగరు.
ఇంతకీ ఛాయ్ ప్రియులను భయపెట్టేంతగా ఈ వీడియోలో ఏముంది అనే కదా మీ సందేహం.. ఇదిగో ఈ ఛాయ్ వాలా తన మూత్రంతో టీ కప్పులు కడుగుతుండగా ఎవరో సీక్రెట్ గా తన మొబైల్ కెమెరాలో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. అలా రికార్డు చేసిన దృశ్యాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
ఈ వైరల్ వీడియో కూడా చూడండి: Viral Prank Video: రూ. 500 నోటును ఇలా 2 వేల నోటు చేయొచ్చా ? వైరల్ ప్రాంక్ వీడియో
అతడు కస్టమర్స్‌కి ఛాయ్ సర్వ్ చేసే టీ కప్పులోనే యూరిన్ పోసిన వీడియో చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా వికారం వచ్చిందని చెబుతూ కామెంట్స్ రూపంలో తమ వికారాన్ని వెళ్లగక్కుతున్నారు. ఛాయ్ ప్రియులు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే వాడిపై తమ ప్రతాపాన్ని చూపిస్తాం అంటూ ఇమోజీల రూపంలో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఛాయ్ అనేది చాలామందికి సంబంధించిన అంశం కావడంతో ఈ వైరల్ వీడియోను చూసిన వారు తమ తమ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేస్తున్నారు. అలా అనేక సామాజిక మాధ్యమాల్లో ఈ వైరల్ వీడియో మరింత వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియో కూడా చూడండి : Skateboarder Falls Under Bike: నడిరోడ్డుపై స్కేట్ బోర్డింగ్.. నేరుగా వెళ్లి బైక్ కింద.. OMG వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook