Today's IPL 2023 Match RCB Vs LSG Dream11 Team Prediction: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సొంత గడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఈ సీజన్‌లో మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ.. రెండో మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. అటు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లో రెండు విజయాలు సాధించి జోరు మీద ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమైన బెంగుళూరు.. సోమవారం లక్నోపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఎం.చిన్నస్వామి స్టేడియం బౌండరీ లైన్లు చిన్నవిగా ఉండడంతో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలమైనది. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 183గా ఉంది. ప్రతి మ్యాచ్‌లో సగటున 18 సిక్సర్లు నమోదవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరదపారే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. అయితే ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు 9.8 ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకుంటే.. స్పిన్నర్లు 8.1 ఎకానమీ రేట్‌తో రన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
ఆర్‌సీబీ జట్టు విషయానికి వస్తే.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ జట్టుతో చేరడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే మిడిల్ ఆర్డర్ ఆర్‌సీబీని భయపెడుతోంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, బ్రేస్‌వెల్ బ్యాట్‌తో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో పెద్దగా సమస్యలు లేవు.
మరోవైపు లక్నో జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఓపెనర్ కైల్ మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరోసారి అతను భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌తో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి వచ్చాడు. క్వింటన్ డికాక్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న దీపక్ హుడా ఫామ్‌ను చాటుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. నికోలస్ పూరన్ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ చేయాల్సి ఉంది. బౌలింగ్‌లో కూడా లక్నోకు ఎలాంటి ఇబ్బంది లేదు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా (అంచనా)..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా/మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదౌనీ, మార్క్ వుడ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్.
డ్రీమ్ 11 టీమ్ (LSG vs RCB Dream11 Team): విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), డుప్లెసిస్, కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook