100-Year-Old Neem Tree Falls: ఆలయంలో వందేళ్ల నాటి చెట్టు కూలి.. 7గురు మృతి, 40 మందికి గాయాలు

Old Neem Tree Falls in Maharashtra: భారీ వర్షాలకు ఆలయంలోని వృక్షం కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలబై మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగింది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 12:52 PM IST
100-Year-Old Neem Tree Falls: ఆలయంలో వందేళ్ల నాటి చెట్టు కూలి.. 7గురు మృతి, 40 మందికి గాయాలు

100-Year-Old Neem Tree Falls in Maharashtra: మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయ ప్రాంగణంలో చెట్టు కూలి ఏడుగురు ప్రాణాలు వదిలారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. 
అకోలా జిల్లాలోని బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ గ్రామంలో గల బాబూజీ మహరాజ్ ఆలయంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే జిల్లాలో గత కొన్ని రోజులుగా ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి ఆలయంలో ప్రాంగణంలో ఉన్న 100 ఏళ్ల నాటి భారీ వేప చెట్టు కూలిపోయి దగ్గరలోని రేకుల షెడ్డుపై పడిపోయింది. దాని కింద అనేక మంది భక్తులు ఆశ్రయం పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో షెడ్డు కింద ఉన్న 40 మందికిపైగా భక్తులు గాయపడగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విరిగిన చెట్టును, కూలిన షెడ్డును లేపేందుకు జేసీబీ యంత్రాలను వినియోగిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరిని జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్చగా.. స్వల్పంగా గాయపడిన వారికి బాలాపూర్‌లో చికిత్స అందిస్తున్నారు. 

Also Read; Droupadi Murmu: తొలిసారి సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ ఘటనపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. 

Also read: Good news: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల వరకే పని..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News