Sukanya Samriddhi Yojana Scheme Benefits 2023: ఆడ పిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో పెట్టుబడి సురక్షితంగా ఉండడంతో పాటు మెచ్యురిటీ పూర్తయిన తరువాత మంచి రాబడి కూడా వస్తుంది. ప్రతి కుటుంబంలో కూతురు చదువులు, పెళ్లిళ్ల ఆందోళన నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో మీరు కేవలం 250 రూపాయల పెట్టుబడిపై 65 లక్షల రూపాయలు పొందుతారు. ఈ పథకం గురించి పూర్తి సమాచరం తెలుసుకోండి.
సుకన్య సమృద్ధి యోజన అంటే..?
సుకన్య సమృద్ధి యోజన అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకం ప్రతి ఇంట్లో ఆడపిల్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారుక. మీరు మీ కుమార్తె భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో మీరు తక్కువ మొత్తంతో ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో మీరు అకౌంట్ ఓపెన్ చేసి.. మీ కుమార్తె పేరు మీద ప్రతి నెల కొద్దికొద్దిగా డబ్బు జమ చేయవచ్చు.
ఎవరు అర్హులు..?
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల ఖాతాను ఆమె తల్లిదండ్రులు తెరవవచ్చు. ఇందులో కేవలం రూ.250 పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఇందులో మీకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల పేరిట ఒక ఖాతా మాత్రమే ఓపెన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు ఆడపిల్లల పేరు మీద ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ కవల పిల్లలు అంతకంటే ఎక్కువ మంది ఒకే కాన్పులో జన్మించి ఉంటే అప్పుడు రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..?
సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందులో ప్రస్తుతం 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ పథకంలో ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే మీరు ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో పెట్టిన పెట్టుబడిపై ఆదాయపు పన్నులో మినహాయింపు కూడా లభిస్తుంది.
65 లక్షల రూపాయలు ఎలా పొందాలి..?
ఈ స్కీమ్‌లో ప్రతి రోజూ 250 రూపాయలు పెట్టుబడి పెడితే.. ఒక నెలకు 12,500 రూపాయలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. ఇలా మొత్తం మీరు 22.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల తర్వాత అంటే మీ కుమార్తె మెచ్యూరిటీకి 21 సంవత్సరాల వయస్సులో మీకు 65 లక్షల రూపాయలు అందుతాయి. ఇందులో మీకు దాదాపు రూ.41.15 లక్షల వడ్డీ లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన కోసం అవసరమైన పత్రాలు
==> తల్లిదండ్రుల గుర్తింపు కార్డు
==> కుమార్తె ఆధార్ కార్డ్
==> కుమార్తె పేరిట తెరిచిన బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
==> కుమార్తె పాస్‌పోర్ట్ సైజు ఫోటో
==> మొబైల్ నంబర్
Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook