Best SUVs Under 10 Lakhs: పంచ్, నెక్సాన్, బ్రెజా మాత్రమే కాదు.. ఈ సూపర్ ఎస్‌యూవీలు కూడా 10 లక్షలే!

Best SUVs Under 10 Lakhs in India 2023. మీరు కూడా ఎస్‌యూవీలను ఇష్టపడితే.. చౌకైన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే భారతీయ కార్ మార్కెట్‌లో చాలా మంచివి ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 28, 2023, 05:59 PM IST
  • పంచ్, నెక్సాన్, బ్రెజా మాత్రమే కాదు
  • ఈ సూపర్ ఎస్‌యూవీలు కూడా 10 లక్షలే
  • టాప్ వేరియంట్‌ల ధర రూ. 14 లక్షలు
Best SUVs Under 10 Lakhs: పంచ్, నెక్సాన్, బ్రెజా మాత్రమే కాదు.. ఈ సూపర్ ఎస్‌యూవీలు కూడా 10 లక్షలే!

Best SUVs Under 10 Lakhs in India 2023: ఎస్‌యూవీలు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎస్‌యూవీల విక్రయాల్లో కూడా భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఎస్‌యూవీల వైపు ప్రజలు మొగ్గుచూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎస్‌యూవీలు విశాలంగా కనిపించడం, సూపర్ లుకింగ్, మెరుగైన మైలేజిని అందించడం ఒక కారణం కావచ్చు. మీరు కూడా ఎస్‌యూవీలను ఇష్టపడితే.. చౌకైన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే భారతీయ కార్ మార్కెట్‌లో చాలా మంచివి ఉన్నాయి. 10 లక్షల రూపాయల లోపు ఉన్న ఎస్‌యూవీల పేర్లను ఇపుడు చూద్దాం. 

SUVs Under 10 Lakhs:
# టాటా పంచ్ (ధర - రూ. 6 లక్షల నుంచి రూ. 9.4 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# టాటా నెక్సాన్ (ధర - రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# మారుతి బ్రెజా (ధర - రూ. 8.19 లక్షల నుంచి  రూ. 13.88 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# హ్యుందాయ్ వెన్యూ (ధర - రూ. 7.68 లక్షల నుంచి రూ. 13.11 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# కియా సోనెట్ (ధర - రూ. 7.69 లక్షల నుంచి రూ. 14.39 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# రెనాల్ట్ కిగర్ (ధరలు - రూ. 6.50 లక్షల నుంచి రూ. 11.23 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# నిస్సాన్ మాగ్నైట్ (ధర - రూ. 5.97 లక్షల నుంచి రూ. 10.94 లక్షలు, ఎక్స్-షోరూమ్)
# మహీంద్రా XUV300 (ధర - రూ. 8.41 లక్షల నుంచి రూ. 14.07 లక్షలు, ఎక్స్-షోరూమ్)

పైన జాబితా చేయబడిన కార్లు అన్ని 5-సీటర్ ఎస్‌యూవీలు. వీటిలో టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్ మినహా మిగిలినవన్నీ 4-మీటర్ ఎస్‌యూవీ విభాగానికి చెందినవి. టాటా పంచ్ కాకుండా ఇతర అన్నిఎస్‌యూవీల యొక్క టాప్ వేరియంట్‌ల ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. వీటిలో టాటా నెక్సాన్, కియా సోనెట్ మరియు మహీంద్రా XUV300 యొక్క టాప్ వేరియంట్‌ల ధర రూ. 14 లక్షల కంటే ఎక్కువగా ఉంది.

Also Read: Airtel Recharge Price Hike: ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు!  

Also Read: Dinesh Karthik: ఆ ఒక్క టోర్నీ నా జీవితాన్నే ఆగం చేసింది.. ఎంఎస్ ధోనీ మేనియా ముందు నిలవలేకపోయా: దినేశ్ కార్తిక్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News