/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

How to Stop Hair Loss: జుట్టు రాలుతోందా ? రాలుతున్న జుట్టుతో బట్ట తల సమస్య ఎక్కువవుతోందా ? యుక్త వయస్సు దాటుతున్న దశలో చాలామందిలో కనిపించే సమస్య ఇది. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలే సమస్య యుక్త వయస్సులోనే కనిపించవచ్చు. ఏ వయస్సు వారికైనా.. జుట్టు రాలే సమస్య మొదలయ్యాకా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలా అనే ఆందోళన వారి మెదడును తినేస్తుంటుంది. అయితే, జుట్టు రాలడం మొదలయ్యాకా కొంతమంది డాక్టర్స్ ని సంప్రదించడం చేస్తే.. ఇంకొంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేక ఇంట్లోనే ఏవేవో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో చిట్కాలు. ఇవి మీకు కూడా ఉపయోగపడతాయోమో ఓ లుక్కేయండి.

అలోవెరా: 
అలోవెరాలో ఉండే సుగుణాలు అన్నీ ఇన్నీ కావు. వెయిట్ లాస్ నుంచి మొదలుకుని... మెరిసే చర్మం వరకు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టే గుణం ఈ కలబంధకు ఉంటుందంటారు. అలాగే హెయిర్ లాస్‌తో బాధ వారికి కూడా అలో వెరా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం అందించనుంది. ఫ్రెష్ అలోవెరాలోంచి తీసిన జెల్‌ని వెంటనే తల మాడుపై రుద్దాలి. అలా 30 నిమిషాలపాటు వదిలేశాకా.. ల్యూక్‌వామ్ వాటర్‌తో కడిగేసుకోవాలి. అలో వెరా వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, పెరగడం ప్రారంభం అవుతుంది. ల్యూక్‌వామ్ వాటర్ అంటే.. మరీ చల్లగా కానీ లేదా మరీ వేడిగా కానీ లేకుండా 100 - 110 ఫారెన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్న నీటిని ల్యూక్‌వామ్ అంటారు. 

ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయతో తయారు చేసిన జ్యూస్ ని మాడుకు అంటడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, మళ్లీ జుట్టు పెరగడం ప్రారంభం అవుతుంది. అందుకు కారణం ఉల్లిపాయలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్ మూలకాలే. ఉల్లిపాయ జ్యూస్ ని 15 - 20 నిమిషాల పాటు మాడుకు మసాజ్ చేసిన తరువాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో కడిగేయాలి.

కోకోనట్ ఆయిల్: 
జుట్టుకు, మాడుకు కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు బ్రేక్ అవడం తగ్గడమే కాకుండా జట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గోరు వెచ్చగా కాచిన కొబ్బరి నూనేను తలకు అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. రాత్రి వేళ అప్లై చేసి మరునాడు ఉదయం షాంపూతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుందట.

ఎగ్ మాస్క్:
కోడి గుడ్డులో ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉంటాయనే విషయం తెలిసిందే. అలాగే జుట్టు పెరగడానికి ప్రోటీన్ ఉపయోగపడుతుందనే సంగతి కూడా తెలిసిందే. పచ్చి కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్ కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుందట. కోడిగుడ్డును పగలకొట్టి ఒక మిశ్రమంగా తయారు చేసి తలకు అంటించి 30 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నీరుతో కానీ లేదా షాంపూతో కానీ కడిగేయాలి.   

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అలాగే జుట్టు పెరగడానికి కూడా అంతే హెల్ప్ చేస్తాయి. గ్రీన్ టీని చల్లారబెట్టిన తరువాత ఆ టీ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేయాలి. అలా ఒక గంట పాటు వదిలేసిన తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అన్ని సందర్భాల్లో హోమ్ రెమెడీస్‌తో సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే.. వెంటనే హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి : Blueberries Health Benefits: బ్లూబెర్రీస్.. తింటే ఆల్ హ్యాపీస్

ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..

ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
hair loss issue, home remedies to stop losing hair, bald head remedies
News Source: 
Home Title: 

Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?

Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Hair Loss Issue: జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా ?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, February 20, 2023 - 17:44
Request Count: 
52
Is Breaking News: 
No