India vs New Zealand 3rd ODI: కివీస్‌పై రెండు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇండోర్ చేరుకున్నారు. భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు ఉజ్జయిని చేరుకుని మహాంకాళి ఆలయంలో ఉదయం జరిగిన భాస్మర్తిలో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు కొంతమంది సహాయక సిబ్బంది కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయ దుస్తులు ధరించి సామాన్యుల మధ్య కూర్చొని భాస్మర్తిని వీక్షించారు. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ శివభక్తిలో మునిగి తేలారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థించామని చెప్పాడు. పంత్ తిరిగి జట్టులోకి రావడం తమకు చాలా ముఖ్యం అని అన్నాదు. కివీస్‌తో వన్డే సిరీస్ గెలుచుకున్నామని.. చివరి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నామన్నాడు. మహాకాళేశ్వరాలయానికి రావడం చాలా ఆనందంగా ఉందని.. మనసు ప్రశాంతంగా ఉందన్నాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. చివరి వన్డేలోనూ గెలిస్తే.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ ఏడాది వరల్డ్ కప్ స్వదేశంలో జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. రిజర్వ్ బెంచ్ అవకాశాలు ఇస్తూ.. బ్యాటింగ్ కూర్పు, బౌలింగ్ బలం పెంచుకుంటోంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర వన్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం 113 రేటింగ్ పాయింట్స్‌తో ఇంగ్లాండ్ జట్టు మొదటిస్థానంలో ఉంది. న్యూజిలాండ్, భారత్ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ.. కొద్దిపాటి తేడాతో 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 112 పాయిట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. 106 పాయింట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో భారత్ గెలిస్తే టాప్ ర్యాంక్ అందుకుంటుంది.
Also Read: UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. పోలీసులపై రాళ్లు విసిరిన స్థానికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook