Gautam Gambhir Interesting talk On Player Of The Series vs Sri Lanka: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్‌తో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు బాదాడు. శ్రీలంకతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 141.50 సగటుతో 283 పరుగులు చేశాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. అయితే కోహ్లీని ఒక్కడినే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక చేయడంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వన్డే సిరీస్‌లో వికెట్స్ పడగొట్టిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను విరాట్ కోహ్లీతో కలిపి సంయుక్తంగా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును ఎంపిక చేయాల్సిందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వన్డే సిరీస్ మొత్తంలో సిరాజ్ బంతితో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని పేర్కొన్నాడు. సెంచరీలు చేసే బ్యాటర్ల వైపే ఎప్పుడూ మొగ్గుచూపుతారని గౌతీ అన్నాడు. సిరాజ్ వన్డే సిరీస్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. టాప్ వికెట్ టేకర్‌గా కూడా నిలిచాడు. సిరాజ్ 10.22 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. కష్టతరమైన బౌలింగ్ ట్రాక్‌లపై బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది.
'విరాట్ కోహ్లీ ఒక్కడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. కోహ్లీతో సమానంగా మొహ్మద్ సిరాజ్ ఉన్నాడని నేను అనుకుంటున్నా. జాయింట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఉండాలి. సిరాజ్ ఎంతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే పెద్ద సెంచరీలు చేసే బ్యాటర్ల వైపే మనం మొగ్గుచూపుతామని తెలుసు. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ బంతితో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కొత్త బంతితో బాగా బౌలింగ్ చేశాడు. ప్రతి గేమ్‌లో తన మార్క్ చూపించాడు' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో కీలక సమరానికి సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్ సేన తలపడనుంది. ఇరు జట్ల మధ్య ముందుగా వన్డే సిరీస్ ఆరంభం కానుంది వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం (జనవరి 18) మధ్యాహ్నం ఆరంభం కానుంది.
Also Read: Maruti Suzuki Cars: కొత్త కారు కొనే వారికి భారీ షాక్.. ఆల్టో నుంచి బ్రెజా వరకు పెరిగిన ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.