Natu Natu Song used by Jaipur Police: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ పాట గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల ఇదే పాటకుగాను మోషన్ పిక్చర్ లో ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వరించడం మరింత హైలైట్ అయింది.
అయితే ఈ సినిమాలో నాటు నాటు పాటకు వచ్చిన క్రేజును రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు తమకు అనుకూలంగా మార్చుకుని పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయకూడదనే సందేశాన్ని ఇస్తూ సే నో టు నో టు నోటు డ్రింకింగ్ వైల్ డ్రైవింగ్ అంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. తాగి వాహనాలు నడపకూడదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జైపూర్ పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నానికి జనం నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.
Raising a glass to RRR's Golden Globe win, but let's make sure it's not in our car.🙌🏻
Drinking and driving is a serious crime and can have tragic consequences.
Celebrate responsibly and make smart choices.💫 pic.twitter.com/fm8Wags2nt
— Jaipur Police (@jaipur_police) January 12, 2023
ఆర్ఆర్ఆర్ మూవీకి తమదైన స్టైల్లో కంగ్రాచ్యూలేట్ చేస్తూనే.. బాధ్యతతో సెలబ్రేట్ చేసుకుందాం అంటూ జైపూర్ పోలీసులు పెట్టిన ఈ ట్విటర్ పోస్టుకు నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. జైపూర్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజెన్స్ జేజేలు కొడుతున్నారు. ఈ పోస్ట్ చూస్తే రాజమౌళి కూడా మెచ్చుకోకుండా ఉండరు కదా..
ఇది కూడా చదవండి : Waltair Veerayya Overseas Collections : ఓవర్సీస్లో వీరయ్య విధ్వంసం.. రేసులో బాలయ్య వెనక్కి
ఇది కూడా చదవండి : Chiranjeevi -Raviteja: మరో మల్టీస్టారర్ కు సిద్దమైన చిరు-రవితేజ.. మైత్రీ మేకర్స్ కూడా రెడీ!
ఇది కూడా చదవండి : Chiranjeevi Comments: డైరెక్టర్ల మొదటి సక్సెస్ అదే అవ్వాలి.. అంతేకానీ అర్రులు చాచకండి.. చిరు కామెంట్స్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook