Suryakumar Yadav: చిన్నప్పుడు నా ఆటను చూసి ఉండవు.. రాహుల్ ద్రవిడ్‌కు క్లాస్ రిప్లై ఇచ్చిన సూర్యకుమార్‌ యాదవ్!

Suryakumar Yadav and Rahul Dravid Funny Interview Video Goes Viral. మూడో టీ20 మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 8, 2023, 03:56 PM IST
  • చిన్నప్పుడు నా ఆటను చూసి ఉండవు
  • ద్రవిడ్‌కు క్లాస్ రిప్లై ఇచ్చిన సూర్యకుమార్‌
  • ఆ రోజు చాలా సంతోషిస్తా
Suryakumar Yadav: చిన్నప్పుడు నా ఆటను చూసి ఉండవు.. రాహుల్ ద్రవిడ్‌కు క్లాస్ రిప్లై ఇచ్చిన సూర్యకుమార్‌ యాదవ్!

Suryakumar Yadav and Rahul Dravid Funny Interview after IND vs SL 3rd T20: రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ ఘన విజయం సాదించడానికి కారణం సూర్యకుమార్‌ యాదవ్. లంక బౌలర్లను ఊచకోత కోస్తూ.. 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఈ సెంచరీ సూర్యకు టీ20ల్లో మూడో శతకం. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అనంతరం సూర్యతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.

బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో సూర్యకుమార్‌ యాదవ్‌‌ను కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిచయం చేశారు. ఈ బ్యాటర్‌ మీకు తెలుసు, అయితే కుర్రాడిగా ఉన్నప్పుడు నా బ్యాటింగ్‌ను చూడని వారిలో ఇతడు కూడా ఉంటాడు అని ద్రవిడ్ అన్నారు. వెంటనే సూర్య మాట్లాడుతూ.. 'నేను చూశాను. చాలా ఇన్నింగ్స్ చూశాను. ఎంజాయ్ చేశాను' అని బదులిస్తాడు. ఆపై నువ్వు చూసి ఉండవనే నేను అనుకుంటున్నా, అందులో ఎలాంటి సందేహం లేదు అని కోచ్ అన్నారు. 

గత ఏడాది కాలంలో నీ ఆటను ప్రత్యక్షంగా చూడటం గర్వంగా భావిస్తున్నా.. ఇప్పటివరకు నువ్ ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఉత్తమమైనది ఎంచుకోమంటే ఏం చెబుతావ్ అని రాహుల్ ద్రవిడ్ ప్రశ్నించగా... 'క్లిష్ట పరిస్థితుల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. అయితే నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఒక దానిని ఎంచుకోవడమంటే కష్టమే. బ్యాటింగ్‌ను చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తా. మైదానంలోకి దిగినప్పుడు నేనేం చేయగలనో అదే చేసేందుకు ప్రయత్నిస్తా' అని సూర్యకుమార్‌ యాదవ్‌‌ బదులిచ్చాడు. 

 విభిన్న షాట్లను కొట్టే క్రమంలో ముందే అలాంటివాటిని అంచనా వేసి ఆడతావా? అని కోచ్ అడగ్గా.. 'టీ20 ఫార్మాట్‌లో ముందే అంచనా వేయాలి. అదే విధంగా ఇతర షాట్లను ఆడాలి. బౌలర్‌ బంతిని ఎలా వేస్తాడు అనే దానిని ముందుగా గ్రహించి షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తా. మూడో టీ20 మ్యాచ్‌లో వెనుక వైపు బౌండరీ లైన్‌ తక్కువగా ఉందనిపించింది. అందుకే అటుగా బంతిని పంపించేందుకు షాట్లు ఆడాను. ఎక్కువగా ఫీల్డర్ల మధ్య ఖాళీ ప్రాంతాలలో బంతిని ఆడడానికి చూస్తాను. ఫీల్డింగ్‌ను బట్టి షాట్లు ఆడుతా' అని సూర్య చెప్పాడు. 

'నేను ట్రైనింగ్‌, ప్రాక్టీస్‌ చేసేటప్పుడు.. బ్యాట్‌ బంతి టచ్‌ అయినప్పుడు వచ్చే శబ్దం పైనే దృష్టి పెట్టేవాడిని. బ్యాట్‌ మిడిల్ అవుతుందా  లేదా అనే దానిపై సాధన చేస్తా. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్, ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో బాగా ప్రాక్టీస్‌ చేశానని అనిపిస్తే.. ఆ రోజు చాలా సంతోషిస్తా. బంతి వచ్చే పోసిషన్ బట్టి మైదనంలో షాట్లు ఆడుతా' అని సూర్య చెప్పాడు. ప్రాక్టీస్‌ సమయంలో ఇలాంటి షాట్లు కొట్టడం నేను చూడలేదు, మరి మైదానంలో ఎలా కొడుతున్నావ్ అని ద్రవిడ్ ప్రశ్నకు మిస్టర్ 360 పై విధంగా సమాధానం చెప్పాడు. 

Also Read: Venus Saturn Transit 2023: శుక్ర శని గోచారం 2023.. ఈ 5 రాశుల వారు 10 రోజుల పాటు నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా!

Also Read: Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. అన్ని దోషాలు తొలగిపోతాయి! అదృష్టం ఇక మీ వెంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News