Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సింపుల్‌గా బెర్త్ మార్చుకోండి ఇలా..

IRCTC: ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మీరు ప్రయాణిస్తున్న బెర్త్ నచ్చకపోతే.. అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ప్రయాణం మధ్యలోనే బెర్త్ మార్చుకోవచ్చు. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 04:11 PM IST
  • బెర్త్ అప్‌ గ్రేడ్ మరింత సులువు
  • ప్రయాణం మధ్యలోనే మార్చుకునే అవకాశం
  • పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సింపుల్‌గా బెర్త్ మార్చుకోండి ఇలా..

IRCTC: ప్రయాణికుల సౌలభ్యం కోసం.. వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేస్తోంది. తాజాగా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. మీరు రిజర్వేషన్ చేసుకున్న బెర్త్ మీకు నచ్చకపోతే ప్రయాణం మధ్యలో దాన్ని అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఉదాహరణకు మీరు స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నట్లయితే.. ప్రయాణ సమయంలో సీటును ఏసీ కోచ్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు ఆన్‌లైన్‌లో వెతకాల్సిన పనిలేదు. 

ప్రయాణికులకు ఉత్తమ సౌకర్యాన్ని అందించడం.. ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలను తీర్చడం ఈ సేవను ప్రారంభించడం ఉద్దేశం. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలను సులభతరం చేసింది. దీనివల్ల టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కూడా కోచ్‌ని అప్‌గ్రేడ్ చేయడం ప్రజలకు మరింత సులువుగా మార్చింది. కొంత అదనపు చెల్లింపుతో ప్రయాణికులు తమ గమ్యాన్ని మార్చుకోవడం ద్వారా అదనపు ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది.

కోచ్‌ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి..?

మీరు ప్రయాణ సమయంలో మీ కోచ్‌ని కూడా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మీరు స్లీపర్ కోచ్‌లో కాకుండా AC కోచ్‌లో ప్రయాణించాలనుకుంటే, దీని కోసం మీరు కోచ్‌లో ఉన్న రైల్వే టీటీఈని సంప్రదించి మీ అభ్యర్థనను అందించాలి. ఏసీ కోచ్‌లో సీటు ఖాళీగా ఉంటే.. టీటీఈ మీకు బెర్త్‌ను కేటాయిస్తారు.

సీటు అప్‌గ్రేడ్‌కు బదులుగా.. మీరు నియమం ప్రకారం టీటీఈకి కొంత నగదు చెల్లించాలి. అయితే మీరు వెళ్లాలనుకుంటున్న కోచ్‌లో బెర్త్ ఖాళీగా ఉన్నప్పుడే మాత్రమే బెర్త్ అప్‌గ్రేడ్ అవుతుంది. సీటు ఖాళీగా లేకుంటే మీకు బెర్త్ కేటాయించిన అదే కోచ్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది.

Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా  

Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News