Harish Shankar on Drainage leaked : హరీష్ శంకర్ సినిమాల పరంగా ఇప్పుడు అంత బిజీగా ఏమీ లేడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటాడు. తన మీద వచ్చే ట్రోల్స్‌పై రియాక్ట్ అవుతుంటాడు. హరీష్ శంకర్ వేసే ట్వీట్లు కాంట్రవర్సికి దారి తీస్తుంటాయి. బండ్ల గణేష్, బీవీఎస్ రవి వంటి వారితో హరీశ్ శంకర్ వివాదం అందరికీ తెలిసిందే. అయితే అవన్నీ పక్కన పెడితే.. హరీష్ శంకర్‌కు అంతో ఇంతో సామాజిక బాధ్యత ఉంటుంది. రోడ్లు బాగా లేకపోయినా, డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా, వర్షాల ధాటికి ఏమైనా నష్టాలు జరిగినా వెంటనే ట్విట్టర్ ద్వారా అధికారులను ప్రశ్నిస్తుంటారు.
హరీష్ శంకర్ ట్వీట్లకు అధికారులు కూడా స్పందిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వేసిన ట్వీట్లను అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, కంపు కొడుతోందని, ఆ కంపులోనే పిల్లలు కూడా ఆడుకుంటున్నారని, దయచేసి సమస్యను పరిష్కరించండని ఫోటోను షేర్ చేశాడు హరీష్ శంకర్. అయితే వీటిపై అధికారులు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. దీంతో హరీష్ శంకర్ మరో ట్వీట్ వేశాడు.
Sir @HMWSSBOnline the situation is getting worse pls take some action ; https://t.co/F8V2ZENkL2
— Harish Shankar .S (@harish2you) December 28, 2022
ఫిర్యాదు చేసి పన్నెండు గంటలు అవుతోంది. కానీ ఇంత వరకు ఎలాంటి రియాక్షన్ లేదు.. ఎవ్వరూ రియాక్ట్ అవ్వడం లేదు.. ఆ కంపుని భరించలేకపోతోన్నాం.. దీన్ని పరిష్కరించమని ఎన్ని సార్లు మిమ్మల్ని అడుక్కోవాలి.. చెప్పండి? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఇంతలా అడుక్కున్నా కూడా అధికారులు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. దీంతో మరోసారి హరీష్ శంకర్ ట్వీట్ వేశాడు. సర్..ఏదో ఒక యాక్షన్ తీసుకోండి.. సిట్యువేషన్ దారుణంగా ఉందని వేడుకున్నాడు. మరి దీనికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడండి.
Also Read : Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్
Also Read : Sreeja Konidela Daughter : నవిష్క బర్త్ డే.. కూతురితో దగ్గరగా, ఆనందంగా శ్రీజ.. దూరంగా కళ్యాణ్ దేవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి