థైరాయిడ్ అనేది చాలా ప్రమాదకరం. నియంత్రించడం చాలా కష్టం. థైరాయిడ్ అనేది గొంతులో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. టీ3, టీ4 హార్మోన్స్ ఎక్కువైతే..థైరాయిడ్ సైజ్ పెరుగుతుంటుంది. అప్పుడే సమస్యలు ఎదురౌతాయి.
థైరాయిడ్ పెరిగితే హైపర్ థైరాయిడిజమ్ అంటారు. థైరాయిడ్ అనేది అయోడిన్ లోపంతో వస్తుంది. సకాలంలో చికిత్స చేయించాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని చిట్కాలతో కూడా థైరాయిడ్ సమస్య దూరం చేయవచ్చు.
థైరాయిడ్ లక్షణాలు
ఆందోళనకు గురి కావడం, వణుకుతుండటం, విసుగు, స్ట్రెస్, కళ్లలో మంట, ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం, కండరాలు బలహీనమవడం
థైరాయిడ్ సమస్యను నియంత్రించేందుకు ధనియా నీరు చాలా మంచిది. ధనియా నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ పెరగకుండా ఆగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, మినరల్స్ థైరాయిడ్ నియంత్రించేందుకు దోహదపడతాయి.
ధనియాల్ని రాత్రి నీళ్లలో నానబెట్టాలి. లేదా నీళ్లలో ఉడకబెట్టాలి. ఉదయం వడకాచి రోజుకు రెండుసార్లు కొన్ని రోజులు నిరంతరం తాగితే థైరాయిడ్ నియంత్రణలో వచ్చేస్తుంది.
బరువు తగ్గడం
ధనియా నీళ్లు తాగడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలున్నాయి. ధనియా నీళ్లలో ఉన్న పోషక పదార్ధాలు బరువు తగ్గించడంలో దోహదపడతాయి. దనియా నీళ్లను ఉదయం పరగడుపున తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
మధుమేహం నియంత్రణ
ధనియా నీళ్లతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రోజూ ధనియా నీళ్లను తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
గుండెకు ఆరోగ్యకరం
ధనియా నీళ్లు గుండెకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. రక్త నాళికల్ని ఆరోగ్యవంతంగా మార్చి..రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
Also read: Gastritis: కడుపులో గ్యాస్ సమస్య ఉంటే..ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook