North Korea Kills Two Minors For Watching South Korea K-Dramas: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతలలో ఒకరిగా పేరున్న కిమ్ జాంగ్ ఉన్ దేశమైన ఉత్తర కొరియాలో క్రూరత్వం తారాస్థాయికి చేరుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఒక సిరీస్ చూసి, దాన్ని షేర్ చేసినందుకు ఇద్దరు మైనర్ పిల్లలను ఉత్తర కొరియాలో కాల్చి చంపారని చెబుతున్నారు. రేడియో ఫ్రీ ఆసియా అనే పత్రిక కధనాల ప్రకారం, ఉత్తర కొరియాలో మొదటిసారిగా ఈ రకమైన శిక్ష విధించబడిందని అంటున్నారు.
నిజానికి డిసెంబర్ 2020లో, దక్షిణ కొరియా నుండి విడుదలయ్యే ఏ రకమైన సినిమా, లేదా సిరీస్ కు సంబంధించిన కంటెంట్ అయినా చూడడం, షేర్ చేడయడం ఘోరమైన నేరంగా పరిగణించబడే చట్టాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆమోదించిందని అంటున్నారు. ఇక కాల్చి చంపబడిన మైనర్‌ల వయస్సు దాదాపు 16 నుండి 17 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు మైనర్లు అక్టోబర్ ప్రారంభంలో ఉత్తర కొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో కలుసుకున్నారని, ఈ ప్రావిన్స్ చైనాతో సరిహద్దులో ఉంటుందని అంటున్నారు.
అక్కడ అనేక కొరియన్ అలాగే అమెరికన్ డ్రామా షోలను వీక్షించారని ది ఇండిపెండెంట్ కొరియన్ అనే మీడియా రిపోర్ట్ చేసింది. ఈ విషయం ఉత్తర కొరియా ప్రభుత్వానికి తెలియగానే మైనర్‌లిద్దరినీ ప్రజల ముందుకు తీసుకొచ్చి బహిరంగంగా కాల్చి చంపారని అంటున్నారు. కొరియా రూల్స్ ప్రకారం, ఆ యువకులు చేసిన నేరం చాలా దారుణమైనది, దీంతో ఆ ప్రాంతంలోని నివాసితులు బహిరంగ మరణ శిక్షను చూడవలసి వచ్చిందని అంటున్నారు.
ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియాను ఒక అమెరికన్ తోలుబొమ్మలా పరిగణిస్తున్నారు. ఉత్తర కొరియాలో అనేక కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ, సినిమాలు, సిరీస్ లు తరచుగా USB డ్రైవ్‌లు లేదా SD కార్డ్‌లలో దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. సాధారణంగా చైనా నుంచి సరిహద్దు మీదుగా వస్తున్నాయని చెబుతున్నారు. గతేడాది కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియా 11 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఆ సమయంలో, పౌరులు నవ్వడానికి, షాపింగ్ చేయడానికి లేదా మద్యం తాగడానికి కూడా అనుమతించబడరు.
Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook