Tom Latham 145, Kane Williamson 94 runs help New Zealand beat India in 1st ODI: టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. గబ్బర్ సేన నిర్దేశించిన 307 పరుగుల లక్ష్య ఛేదనను కివీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలో ఛేదించింది. స్టార్ బ్యాటర్ టామ్ లాథమ్ (145 నాటౌట్; 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్: 98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
307 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. కివీస్ ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే ఔటయ్యారు. డెవాన్ కాన్వే 24, ఫిన్ అలెన్ 22 రన్స్ చేసి ఔటయ్యారు. ఆపై డారిల్ మిచెల్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించారు. దాంతో కివీస్ అలవోక విజయం సాధించింది. ఈ జోడీని విడదీసేందుకు బౌలర్లు అష్టకష్టాలు పడినా ఫలితం లేకపోయింది.
That's that from the 1st ODI.
New Zealand win by 7 wickets, lead the series 1-0.
Scorecard - https://t.co/JLodolycUc #NZvIND pic.twitter.com/HEtWL04inV
— BCCI (@BCCI) November 25, 2022
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శ్రేయస్ అయ్యర్ (80), శుభ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్ చివాలో వాషింగ్టన్ సుందర్ (37), సంజూ శాంసన్ (36) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. హామిల్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
Also Read: Shreyas Iyer Record: శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు.. ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాలేదు!
Also Read: Shikhar Dhawan Record: న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ.. దిగ్గజాల సరసన శిఖర్ ధావన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.