Vanasthalipuram: సీఐ రాసలీలలు.. కారులో మహిళతో ఏకాంతంగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

CI Arrested in Vanasthalipuram: మహిళతో సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. కారులో మహిళతో ఉన్న సీఐను భార్యతో కలిసి పోలీసులు పట్టుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 01:24 PM IST
Vanasthalipuram: సీఐ రాసలీలలు.. కారులో మహిళతో ఏకాంతంగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

CI Arrested in Vanasthalipuram: వనస్థలిపురం పీఎస్ పరిధిలో మరో సీఐ అక్రమ సంబంధం బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కారులో ఏకాంతంగా ఉండగా.. భార్యతో కలిసి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే తనను పట్టుకున్నందుకు తిరిగి పోలీసులపైనే ఆయన దాడికి దిగారు. వివరాలు ఇలా.. 

హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఎస్‌బీ విభాగంలో సీఐగా రాజు పనిచేస్తున్నారు. ఆయనకు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. వనస్థలిపురంలో మహిళతో కారులో ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న భార్య.. అక్కడికి వెళ్లి భర్తతో గొడవ పెట్టుకుంది. గొడవను చూసి వనస్థలిపురం పోలీసులు ఏం జరిగిందని ఆరా తీశారు. మద్యం మత్తులో ఉన్న రాజు.. తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు. అక్రమ సంబంధ పెట్టుకున్న మహిళతో పాటు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుల్స్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. 

తనకు, తన పిల్లకు అన్యాయం చేసిన తన భర్తపై, మహిళపై చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ రాజు భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. 

ఇటీవలె ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. వనస్థలిపురం లాడ్జిలో వేరే మహిళతో ఉండగా.. మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె, భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ నాగేశ్వరరావుపై కేసుల్లో విచారణ ఎదుర్కొంటుండగా.. అతనిని సర్వీసుల నుంచి ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. 

Also Read: TRS mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడే హైకోర్టులో విచారణ.. అందరిలోనూ ఉత్కంఠ  

Also Read: CM KCR: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స్కెచ్.. కేసీఆర్ సంచలన కామెంట్స్.. వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News