Myositis Disease Samantha: గత కొన్ని రోజుల నుంచి సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇతర దేశాల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పై సమంత స్పందించింది. అప్పుడు సమంత ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పింది. కానీ శనివారం రోజున తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మయోసైటిస్ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. బయోసైటీస్ అనేది ఇమ్యూన్ కండిషన్ కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు సామ్ హెల్త్ కండిషన్ నిలకడగానే ఉందని పేర్కొంది. అతి త్వరలో పూర్తిగా కోలుకుంటానని.. వైద్యులపై పూర్తి నమ్మకం ఉందని నటి తెలిపింది.
మయోసైటిస్ అంటే ఏమిటి?
మయోసైటిస్ అనేది కండరాల వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య. దీవి వల్ల కండరాలు వాపుకు గురవుతాయి. దీని వల్ల కొన్ని సందర్భాల్లో రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి వల్ల ఆరోగ్యకరమైన కండరాలు కూడా సులభంగా దెబ్బతింటాయి. దీంతో వాపు, నొప్పిలు సంభవించి చివరకు శరీర బలహీనత వచ్చే అవకాశాలున్నాయి.
కారణాలు:
మయోసైటిస్ రావడానికి ముందుగా అలసట, నొప్పులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ లక్షణాలన్నీ సాధరణమైనవి ఈ వ్యాధిని గుర్తి పట్టడం చాలా కష్టం. అంతేకాకుండా దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు రావొచ్చు.
మయోసైటిస్ రావడానికి అనేక కారణాలు:
1. తీవ్రమైన మైయోసిటిస్కు కారణమయ్యే పరిస్థితులు:
>>డెర్మాటోమియోసిటిస్ ( ఈవ్యాధి ఎక్కువగా మహిళల్లో వస్తుంది. ఇది కండరాలను ప్రభావితం చేసి.. ముఖ్యంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు వస్తాయి.)
>>పాలీమయోసిటిస్ (భుజాలు, తుంటి, తొడ కండరాల బలహీనత)
>>లూపస్
>>స్క్లెరోడెర్మా
>>కీళ్ళ వాతము
2. ఇన్ఫెక్షన్:
మయోసైటిస్ అనేది అంటువ్యాధుల నుంచి కూడా వచ్చే ఇన్ఫెక్షన్. దీని ఫలితంగా నేరుగా కండరాలు దెబ్బతింటాయి.
3. గాయం:
తీవ్రమైన వ్యాయామాలు చేసే క్రమంలో కండరాలకు అసౌకర్యం కలిగి బలహీనంగా ఏర్పడుతాయి. ఇలా ఎర్పడితే కొన్ని సందర్భాల్లో మయోసైటిస్ వ్యాధికి దారీ తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు:
>>మయోసైటిస్ ప్రధాన లక్షణం కండరాల బలహీనంగా మారడం.
>>అలసట, దద్దుర్లు, సమతుల్యత కోల్పోవడం, చేతులపై చర్మం గట్టిపడటం, కండరాలు బలహీనంగా, నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
చికిత్స:
నేషనల్ హెల్త్ సర్వీస్ (UK) ప్రకారం.. మయోసైటిస్కు ప్రత్యేకమైన చికిత్స లేదు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఫిజియోథెరపీతో పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ-రుమాటిక్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook